త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alastair Cook | నో-హ్యాండ్‌ షేక్‌.. భారత్‌-పాకిస్తాన్‌ ఆటగాళ్లపై అలిస్టర్‌ కుక్‌ సంచనల వ్యాఖ్యలు..

Alastair Cook | భారత్‌, పాకిస్తాన్‌ జట్లపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మైదానంలో కనిపించే తీవ్రత, కరచాలనం చేయకపోవడం అన్నీ కేవలం ప్రజలను, కెమెరాలను ఆకర్షించడానికి మాత్రమేనని, మూసిన గదుల్లో మాత్రం స్నేహంగా, సహజంగా మాట్లాడుకుంటారంటూ వ్యాఖ్యానించాడు.

P

Sports | Published On Feb 20, 2026, 9.50 pm IST

Alastair Cook | నో-హ్యాండ్‌ షేక్‌.. భారత్‌-పాకిస్తాన్‌ ఆటగాళ్లపై అలిస్టర్‌ కుక్‌ సంచనల వ్యాఖ్యలు..
Advertisement

Alastair Cook | భారత్‌, పాకిస్తాన్‌ జట్లపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మైదానంలో కనిపించే తీవ్రత, కరచాలనం చేయకపోవడం అన్నీ కేవలం ప్రజలను, కెమెరాలను ఆకర్షించడానికి మాత్రమేనని, మూసిన గదుల్లో మాత్రం స్నేహంగా, సహజంగా మాట్లాడుకుంటారంటూ వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించిన తర్వాత ‘స్టిక్ టు క్రికెట్’ అనే పాడ్‌కాస్ట్‌లో ఈ అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, డేవిడ్ లాయిడ్, ఫిల్ టఫ్నెల్ కూడా పాల్గొన్నారు. టఫ్నెల్ మాట్లాడుతూ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఇప్పుడు ఏకపక్షంగా మారిందని పేర్కొన్నారు. అయితే, మైఖేల్ వాన్ దీనిపై స్పందిస్తూ పాకిస్థాన్ ఆటగాళ్లు భారత జట్టును చూసి భయపడుతున్నట్లు ఉందని తెలిపాడు.

అలాగే, ఈ జట్ల మధ్య కరచాలనం చేయకపోవడం చాలా బాధాకరమని, సిగ్గుచేటు వాన్‌ కామెంట్‌ చేశారు. అయితే, అలిస్టర్ కుక్ ఈ అంశాన్ని మరింత భిన్నంగా విశ్లేషించాడు. మైదానంలో కరచాలనం చేయకపోవడం కేవలం షో కోసమేనని.. నిజానికి స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటారని, సహజంగానే ఉంటారని స్పష్టం చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గత ఏడాది ఆసియా కప్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్థాన్ కెప్టెన్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించడంతో ఈ 'నో-హ్యాండ్‌ షేక్' పద్ధతి మొదలైంది. ఆ టోర్నమెంట్‌లోని మూడు మ్యాచ్‌లలో కూడా ఇరు జట్లు ఒకరినొకరు అభినందించలేదు. ఈ విధానం తర్వాత మహిళల ప్రపంచకప్, ఎమర్జింగ్ ఆసియా కప్, యూత్ ప్రపంచకప్‌లలో కొనసాగింది. తాజా టీ20 ప్రపంచకప్‌లో కూడా ఈ విధానాన్ని కొనసాగించారు. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఇదే విధానాన్ని కొనసాగించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement