త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ind vs Zim | దంచికొట్టిన అభిషేక్, హార్ధిక్ – జింబాబ్వేపై టీమిండియా ఘ‌న విజ‌యం

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సెమీస్ ఆశ‌లను నిలుపుకుంది టీమిండియా. గురువారం జింబాబ్వేపై 72 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. బ్యాటింగ్‌లో అభిషేక్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్య మెరుపులు మెరిపించి టీమిండియాకు విక్ట‌రీని అందించారు.

N

Sports | Published On Feb 26, 2026, 10.56 pm IST

Ind vs Zim  | దంచికొట్టిన అభిషేక్, హార్ధిక్ – జింబాబ్వేపై టీమిండియా ఘ‌న విజ‌యం
Advertisement

Ind vs Zim |  టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సూప‌ర్ 8లో టీమిండియా తొలి విజ‌యాన్ని అందుకుంది. గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో జింబాబ్వేను చిత్తు చేసిన భార‌త జ‌ట్టు సెమీస్ ఆశ‌లు నిలుపుకుంది. బ్యాట‌ర్లు విజృంభ‌ణ‌తో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇర‌వై ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 256 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య‌ఛేద‌న‌లో జింబాబ్వే 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు న‌ష్ట‌పోయి 184 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 72 ర‌న్స్ తేడాతో ఓట‌మి పాలైంది.

ఆరంభంలో అభిషేక్‌...చివ‌ర‌ల్లో పాండ్య‌....

చావో రేవో తేలాల్సిన ఈ మ్యాచ్‌లో భార‌త బ్యాట‌ర్లు దంచికొట్టారు. అభిషేక్ శ‌ర్మ‌తో పాటు హార్దిక్ పాండ్య హాఫ్ సెంచ‌రీల‌తో మెరిశారు. సంజూ శాంస‌న్‌, ఈషాన్ కిష‌న్‌తో పాటు కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ దూకుడుగా ఆడ‌టంతో టీమిండియా ఇర‌వై ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి 256 ప‌రుగులు చేసింది. గ‌త మ్యాచ్‌ల‌లో దారుణంగా విఫ‌ల‌మైన అభిషేక్ శ‌ర్మ జింబాబ్వే మ్యాచ్‌తో ఫామ్‌లోకి వ‌చ్చాడు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. అత‌డికి తోడు సంజు శాంస‌న్ కూడా దంచికొట్ట‌డంతో మూడు ఓవ‌ర్ల‌లోనే యాభై ప‌రుగుల‌కు చేరువైంది. ప‌దిహేను బాల్స్‌లోనే ఓ ఫోర్‌, రెండు సిక్స‌ర్ల‌తో 24 ప‌రుగులు చేసి జోరుమీదున్న సంజూ శాంస‌న్ ముజ‌ర‌బానీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

ఫ‌స్ట్ హాఫ్ సెంచ‌రీ...

ఆ త‌ర్వాత ఈషాన్ కిష‌న్‌తో క‌లిసి అభిషేక్ శ‌ర్మ టీమిండియా స్కోరును ప‌రుగులు పెట్టించాడు. ఇషాన్ కిష‌న్ ఇర‌వై నాలుగు బాల్స్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స‌ర్‌తో 38 ప‌రుగులు చేయ‌గా...అభిషేక్ శ‌ర్మ 30 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో 55 ర‌న్స్‌తో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో తొలి హాఫ్ సెంచ‌రీని న‌మోదు చేశాడు.
సూర్య‌కుమార్ యాద‌వ్ వ‌చ్చి రావ‌డంతోనే జింబాబ్వే బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. కేవ‌లం 13 బాల్స్‌లోనే మూడు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 33 ర‌న్స్ చేశాడు.
చివ‌ర‌లో హార్దిక్ పాండ్య‌, తిల‌క్ వ‌ర్మ కూడా బ్యాట్ ఝులిపించ‌డ‌తంఓ టీమిండియా భారీ స్కోరు చేసింది. హార్దిక్ పాండ్య 23 బాల్స్‌లోనే నాలుగు సిక్స‌ర్లు, రెండు ఫోర్ల‌తో 50 ర‌న్స్ చేయ‌గా...తిల‌క్ వ‌ర్మ 16 బాల్స్‌లో నాలుగు సిక్స‌ర్లు, మూడు ఫోర్ల‌తో 44 ప‌రుగులు చేశాడు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో సికంద‌ర్ ర‌జా మిన‌హా మిగిలిన వారంతా తేలిపోయారు.

ఒంట‌రిపోరాటం...

టీమిండియా విధించిన ల‌క్ష్యాన్ని ఛేదించ‌డంలో జింబాబ్వే విఫ‌ల‌మైన ఓపెన‌ర్ బ్ర‌యాన్ బెన్నెట్ మాత్రం ఒంట‌రి పోరాటంతో ఆక‌ట్టుకున్నాడు. భార‌త బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న బెన్నెట్ 59 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్స‌ర్ల‌తో 97 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తృటిలో సెంచ‌రీ మిస్స‌య్యాడు. కెప్టెన్ సికంద‌ర్ ర‌జా 21 బాల్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స‌ర్ల‌తో 31 ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించాడు. మ‌రుమ‌ని 20 ప‌రుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్స్ సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. టీమిండియా బౌల‌ర్ల‌లో ఆర్ష‌దీప్ మూడు వికెట్లు తీసుకోగా...వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అక్ష‌ర్ ప‌టేల్‌, శివ‌మ్ దూబేల‌కు త‌లో వికెట్ ద‌క్కింది.

 

Advertisement
Advertisement