Black Magic | ఉప్పల్ మ్యాచ్‌లో బ్లాక్ మ్యాజిక్ కలకలం..! దూబే అవుట్ కావడానికి అభిమానే కారణమా? వీడియో వైరల్..!
Black Magic | ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని అందుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై 10 పరుగుల తేడాతో గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ఈ సీజన్‌లో తన మూడో విజయం నమోదు చేసింది.
Black Magic | ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని అందుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై 10 పరుగుల తేడాతో గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ ఈ సీజన్‌లో తన మూడో విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ హైదరాబాద్ జట్టు సమష్టిగా రాణించింది. ఇదిలా ఉండగా, సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో ఓ విచిత్ర ఘటన చర్చనీయాంశంగా మారింది. గ్యాలరీలో ఉన్న ఓ అభిమానితో సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో ప్రకారం.. చెన్నై బ్యాటర్ శివం దూబే క్రీజులో ఉన్న సమయంలో ఓ సన్‌రైజర్స్ అభిమాని చేతిలో నిమ్మకాయ పట్టుకుని ఏదో మంత్రాలు జపిస్తున్నట్లు కనిపించాడు.
Black magic live 😭 pic.twitter.com/rzJYd6kjti
— Out Of Context Cricket (@GemsOfCricket) April 19, 2026
అదే సమయంలో సాకిబ్ హుస్సేన్ వేసిన బంతికి దూబే క్లీన్ బౌల్డ్ కావడం వీడియోలో కనిపించింది. ఆ అభిమానితో దీనికి సంబంధం ఉందన్నట్టు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. దూబే ఔట్ కావడంతో ఆ అభిమాని ఆనందోత్సాహాల్లో మునిగిపోయిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ వీడియోపై అభిమానుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు సరదాగా చేయగా.. యాదృశ్చికంగా బ్యాట్స్‌మెన్ అవుట్ అయ్యాడని పేర్కొన్నారు. మరికొందరు ఇలాంటి పట్టించుకోవద్దని పేర్కొన్నారు. మరికొందరు “బ్లాక్ మ్యాజిక్ ప్రభావమే” అంటూ సెటైరికల్‌గా స్పందించగా.. మరికొందరు చెన్నై ఓటమికి ఆ అభిమానినే కారణమంటూ చమత్కరిస్తున్నారు. ఇంకొందరు మంత్రాలతో మ్యాచులు గెలువలేమంటూ స్పందించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై చెన్నై జట్టు యాజమాన్యం బీసీసీఐకి ఫిర్యాదు చేసిందంటూ సోషల్ మీడియాలో లేఖ వైరల్ అవుతోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉన్నది అనేది తెలియరాలేదు.
Is this for real? Black Magic Complaint in #IPL? #CSK pic.twitter.com/osUuqcSmED
— Mohit Grover ਮੋਹਿਤ ਗਰੋਵਰ (@mgmohitgrover) April 19, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






