త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు కేకేఆర్‌కు షాక్‌.. స్టార్‌ పేసర్‌ హర్షిత్‌ రాణా దూరం..!

IPL 2026 | ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక పేసర్‌గా గుర్తింపు పొందిన హర్షిత్‌ రాణా (Harshit Rana) మోకాలి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

P

Sports | Published On Mar 14, 2026, 3.24 pm IST

IPL 2026 | ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు కేకేఆర్‌కు షాక్‌.. స్టార్‌ పేసర్‌ హర్షిత్‌ రాణా దూరం..!
Advertisement

IPL 2026 | ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక పేసర్‌గా గుర్తింపు పొందిన హర్షిత్‌ రాణా (Harshit Rana) మోకాలి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నెల 28న టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతను దూరం కావడంతో జట్టు బౌలింగ్ కాంబినేషన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. గత ఫిబ్రవరిలో ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌కి ముందు దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టుతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో రాణా మోకాలికి గాయమైంది.

అప్పటి నుంచి విశ్రాంతిలో ఉన్న అతను ఐపీఎల్ ప్రారంభానికి ముందు పూర్తిగా కోలుకునే అవకాశాలు కనిపించకపోవడంతో ఈ సీజన్‌కు దూరంగా ఉండాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తన కథనంలో వెల్లడించింది. జట్టులోని ఇతర యువ బౌలర్లకు ఇప్పుడు అవకాశం లభించనుంది. వైభవ్, ఉమ్రాన్, కార్తీక్, ఆకాశ్ వంటి పేసర్లు తమ ప్రతిభను నిరూపించుకునే ఛాన్స్‌గా దీన్ని ఉపయోగించుకోవచ్చని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. అయితే రాణా స్థానంలో కొత్త ఆటగాడిని ఎంపిక చేయాలా లేదా అన్న అంశంపై ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇదిలా ఉండగా, రాణా గాయంపై వార్తలు వెలువడకముందే కేకేఆర్ తమ పేస్ దళాన్ని బలోపేతం చేసుకుంది. జింబాబ్వేకు చెందిన వేగవంతమైన బౌలర్ బ్లెస్సింగ్‌ ముజరబానిని జట్టులోకి చేరుకున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది.

ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వేగం, బౌన్స్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సవాల్ విసరగలడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో 13 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ముజరబానీ రాకతో జట్టు పేస్ దళం మరింత బలపడిందని కేకేఆర్ తెలిపింది. టీ20 ఫార్మాట్‌లో అతనికి విశేష అనుభవం ఉందని, అంతర్జాతీయంగా 80కు పైగా మ్యాచ్‌లు ఆడి 90కిపైగా వికెట్లు సాధించాడని పేర్కొంది. గత డిసెంబర్‌లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను జట్టులో నుంచి విడుదల చేసిన కేకేఆర్‌.. ముజరబాని చేరికతో పేస్‌ విభాగంలో కొంత లోటును కొంత వరకు పూడ్చుకున్నట్లయ్యింది.ఒకవైపు కీలక భారత పేసర్ గాయంతో దూరమైనప్పటికీ, మరోవైపు అనుభవజ్ఞుడైన విదేశీ బౌలర్‌ను జట్టులోకి తీసుకోవడం ద్వారా కేకేఆర్ తమ బౌలింగ్ దళంలో సమతుల్యతను సాధించే ప్రయత్నం చేస్తోంది.

Advertisement
Advertisement