New Zealand vs Belgium | న్యూజిల్యాండ్‌పై బెల్జియం బిగ్ విక్టరీ
New Zealand vs Belgium | ఫిఫా ప్రపంచకప్-2026 గ్రూప్-జీ చివరి లీగ్ మ్యాచ్‌లో బెల్జియం అద్భుత ప్రదర్శన చేసింది. వాంకోవర్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 5-1 తేడాతో చిత్తుచేసి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. మొదటి నుంచి చివరి వరకు బెల్జియం ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ ఆరంభంలోనే బెల్జియం దూకుడు కనిపించింది.
- 5-1 తేడాతో ఘన విజయం
- నాకౌట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ
New Zealand vs Belgium | ఫిఫా ప్రపంచకప్-2026 గ్రూప్-జీ చివరి లీగ్ మ్యాచ్‌లో బెల్జియం అద్భుత ప్రదర్శన చేసింది. వాంకోవర్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 5-1 తేడాతో చిత్తుచేసి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. మొదటి నుంచి చివరి వరకు బెల్జియం ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ ఆరంభంలోనే బెల్జియం దూకుడు కనిపించింది. తొలి నిమిషాల్లోనే వారికి పెనాల్టీ అవకాశం లభించినా.. వీఏఆర్ సమీక్ష అనంతరం రిఫరీ ఆ నిర్ణయాన్ని క్యాన్సిల్ చేశారు. అయితే, ఆ నిరాశ ఎక్కువసేపు నిలవలేదు. బంతిపై నియంత్రణను పూర్తిగా తమవైపు ఉంచుకున్న బెల్జియం కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. 28వ నిమిషంలో బెల్జియం ఖాతా తెరిచింది. కెవిన్ డి బ్రూయిన్ ఇచ్చిన కార్నర్ కిక్‌ను న్యూజిలాండ్ డిఫెన్స్ సరిగ్గా క్లియర్ చేయలేకపోయింది.
ఆ అవకాశాన్ని వేగంగా అందిపుచ్చుకున్న లియాండ్రో ట్రోసార్డ్ దగ్గరి నుంచి బంతిని గోల్‌లోకి నెట్టాడు. ఈ గోల్‌తో బెల్జియం ఆధిక్యం సాధించింది. రెండో అర్ధభాగం ప్రారంభమైన వెంటనే బెల్జియం మరింత దూకుడుగా ఆడింది. 50వ నిమిషం దాటకముందే కెవిన్ డి బ్రూయిన్ అందించిన అద్భుత పాస్‌తో ట్రోసార్డ్ మరోసారి గోల్ చేశాడు. అతని తొలి ప్రయత్నం అడ్డుకుపోయినా, రీబౌండ్‌ను చాకచక్యంగా గోల్‌గా మార్చాడు. దీంతో స్కోరు 2-0కి చేరింది. 66వ నిమిషంలో కెవిన్ డి బ్రూయిన్ తన పేరును గోల్ స్కోరర్స్ జాబితాలో చేర్చుకున్నాడు. పెనాల్టీ బాక్స్ అంచు నుంచి అతను కొట్టిన కచ్చితమైన షాట్ నేరుగా గోల్ పోస్ట్‌లోకి వెళ్లింది. ఈ గోల్‌తో న్యూజిలాండ్ ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి.
అయినా, న్యూజిలాండ్ చివరి వరకూ ప్రయత్నం చేసింది. 80వ నిమిషం దాటిన తర్వాత ఎలిజా జస్ట్ ఓ గోల్ సాధించి ఓదార్పు ఇచ్చాడు. అయితే, అది కేవలం స్కోరు తేడాను తగ్గించడానికే పరిమితమైంది. మ్యాచ్ చివరి దశలో బెల్జియం మరింత గట్టిగా దాడులు చేసింది. ప్రత్యామ్నాయ ఆటగాడు రొమేలు లుకాకు గోల్ సాధించగా.. చివరలో అలెక్సిస్ సాలేమేకర్స్ కూడా స్కోరు చేశాడు. దీంతో బెల్జియం 5-1తో ఘన విజయాన్ని అందుకున్నది. ఈ విజయంతో బెల్జియం గ్రూప్-జీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొత్తం మ్యాచ్‌లో బంతిపై నియంత్రణ, ఫాస్టెస్ట్ పాస్‌లు, సమన్వయంతో కూడిన ఎటాకింగ్ కలిసి న్యూజిలాండ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కెవిన్ డి బ్రూయిన్ మిడ్‌ఫీల్డ్‌లో ఆటను నియంత్రించిన తీరు బెల్జియం విజయానికి ప్రధాన కారణం. రౌండ్ ఆఫ్-32కు అర్హత సాధించిన బెల్జియం.. ఈ ప్రదర్శనతో టోర్నీలో టైటిల్ రేసులో తాము సైతం టైటిల్ ఫేవరెట్‌గా సంకేతాలు పంపింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Leopard | శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనల్లో స్థానికులు
- ●Neeraj Chopra | ఆసియా గేమ్స్‌లో నీరజ్ చోప్రా.. గాయం నుంచి కోలుకుంటున్న బల్లెం వీరుడు..
- ●Egypt Vs Iran | ఈజిప్ట్-ఇరాన్ మ్యాచ్ డ్రా..
- ●Bhagyaraj Telugu Movies | భాగ్యరాజ్ తెలుగులో చేసిన సినిమాలు ఇవే - మగధీరకు డైలాగ్స్ - నాగార్జున బాలీవుడ్ మూవీకి డైరెక్టర్‌గా...
- ●Standard Engineering Technology | ఏఐ రంగంలోకి స్టాండర్డ్ ఇంజినీరింగ్.. షేర్లపై అందరి దృష్టి..
- ●Pregnant Woman | కడుపులోని బిడ్డకు డీఎన్ఏ టెస్ట్.. భర్త, అత్త వేధింపులతో గర్భిణి ఆత్మహత్య

Leopard | శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత సంచారం.. భయాందోళనల్లో స్థానికులు

Neeraj Chopra | ఆసియా గేమ్స్‌లో నీరజ్ చోప్రా.. గాయం నుంచి కోలుకుంటున్న బల్లెం వీరుడు..

Egypt Vs Iran | ఈజిప్ట్-ఇరాన్ మ్యాచ్ డ్రా..

Bhagyaraj Telugu Movies | భాగ్యరాజ్ తెలుగులో చేసిన సినిమాలు ఇవే - మగధీరకు డైలాగ్స్ - నాగార్జున బాలీవుడ్ మూవీకి డైరెక్టర్‌గా...





