Under 19 World Cup | ఆరోసారి వరల్డ్ కప్ టైటిల్.. యువ భారత్‌కు నజరానా ప్రకటించిన బీసీసీఐ..!
Under 19 World Cup | హరారే వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో విజయం సాధించిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ.7.5కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
Under 19 World Cup | హరారే వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో విజయం సాధించిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ.7.5కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం జరిగిన అండర్-19 వరల్డ్ కప్‌లో ఆయుష్ మాత్రే నేతృత్వంలో యువ భారత్ వంద పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్‌కు ఆరో వరల్డ్ కప్ టైటిల్‌ను అందించింది. జింబాబ్వేలో జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతమైన అజేయ ప్రదర్శనతో భారతదేశానికి ఆరో టైటిల్‌ను అందించిన విజేత భారత అండర్-19 జట్టుకు, కోచింగ్, సహాయక సిబ్బందికి, జూనియర్ క్రికెట్ కమిటీకి రూ. 7.5 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ ప్రకటించారని బీసీసీఐ ఓ ప్రకటన తెలిపింది.
హృషికేశ్ కనిత్కర్ కోచ్‌గా వ్యవహరించిన భారత జట్టు టోర్నమెంట్ అజేయంగా రాణించి టైటిల్‌ను నెగ్గింది. ఫైనల్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ ఇంగ్లండ్‌కు 412 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ యువ భారత్ ప్రదర్శనను అభినందించారు. ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్ గెలవడం అద్భుతమైన విజయం, వయో-పరిమితి క్రికెట్‌లో భారతదేశ సత్తాకు నిదర్శనమన్నారు. జట్టు టోర్నమెంట్ ఆసాంతం ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో రాణించిందన్నారు. మెన్స్, వుమెన్స్ అండర్-19 వరల్డ్ కప్ టైటిల్స్‌ను భారత్ గెలువడం గర్వకారణమన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






