త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gujarat Titans | గుజ‌రాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌గా మాథ్యూ హెడెన్‌..!

Gujarat Titans | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌-2026 సీజ‌న్ త్వ‌ర‌లో ప్రారంభం కాన్న‌ది. ఈ సంద‌ర్భంగా గుజ‌రాత్ టైటాట్స్ జ‌ట్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్‌ను కొత్త బ్యాటింగ్ కోచ్‌గా నియ‌మించిస్తున్న‌ట్లు ఫ్రాంచైజీ ప్ర‌క‌టించింది.

P

Sports | Published On Mar 10, 2026, 5.10 pm IST

Gujarat Titans | గుజ‌రాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌గా మాథ్యూ హెడెన్‌..!
Advertisement

Gujarat Titans | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌-2026 సీజ‌న్ త్వ‌ర‌లో ప్రారంభం కాన్న‌ది. ఈ సంద‌ర్భంగా గుజ‌రాత్ టైటాట్స్ జ‌ట్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్‌ను కొత్త బ్యాటింగ్ కోచ్‌గా నియ‌మించిస్తున్న‌ట్లు ఫ్రాంచైజీ ప్ర‌క‌టించింది. ఈ ఆస్ట్రేలియా మాజీ బ్యాటింగ్ దిగ్గ‌జం ఇక‌పై గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్‌కు టీ20 బ్యాటింగ్‌లోని మెళుకువలు నేర్పించ‌నున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో హేడెన్ మొత్తం 273 అంతర్జాతీయ మ్యాచులు ఆడి 15వేల‌కుపైగా పరుగులు చేశాడు. అలాగే ఆస్ట్రేలియా జాతీయ జ‌ట్టు త‌ర‌ఫున రెండుసార్లు ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు. ఐసీసీ టోర్నమెంట్‌లలో ఆస్ట్రేలియా విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు.

హెడెన్ నియ‌మించ‌డాన్ని గుజ‌రాత్ టైటాన్స్ డైరెక్ట‌ర్ ఆఫ్ క్రికెట‌ర్ విక్ర‌మ్ సొలంకీ కీల‌క ముంద‌డుగుగా పేర్కొన్నారు. ఆయనకు ఉన్న అనుభవం, యువ ఆటగాళ్లను మార్గనిర్దేశం చేసే సామర్థ్యం వచ్చే సీజన్‌లో బ్యాటింగ్ ఐడెంటిటీని మరింత బలోపేతం చేస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ.. మంచి బ్యాటింగ్ ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచుతుంద‌ని.. కానీ గొప్ప బ్యాటింగ్ మ్యాచ్‌పై పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తుంద‌న్నారు. అదే ప్రమాణాన్ని గుజరాత్ టైటాన్స్ కోసం ఏర్ప‌ర‌చాల‌నుకుంటున్నామ‌ని హెడెన్ పేర్కొన్నారు.

హేడెన్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లోనూ పాల్గొన్నాడు. మొత్తం 32 ఐపీఎల్ మ్యాచు ఆడాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 2008-2010 మ‌ధ్య చెన్నై సూప‌ర్ కింగ్స్‌కి ప్రాతినిథ్యం వ‌హించాడు. 32 మ్యాచ్‌ల్లో 137.51 స్ట్రైక్ రేట్‌తో 1,107 పరుగులు చేశాడు. 2009లో 572 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. స‌మాచారం మేర‌కు.. ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాడు మ్యాథూ వేడ్ స్థానాన్ని హేడెన్‌తో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. వేడ్ గుజ‌రాత్ జ‌ట్టుకు 2025 సీజ‌న్‌ల అసిస్టెంట్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

https://x.com/gujarat_titans/status/2031244974713614660

Advertisement
Advertisement