త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AUS vs IRE | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలి ఆస్ట్రేలియా విజ‌యం.. పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి ఐర్లాండ్‌..!

AUS vs IRE | టీ20 వరల్డ్ కప్‌ని ఆస్ట్రేలియా జ‌ట్టు విజ‌యంతో ప్రారంభించింది. కొలంబో వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఆసిస్ 67 ప‌రుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది.

P

Sports | Published On Feb 11, 2026, 7.43 pm IST

AUS vs IRE | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలి ఆస్ట్రేలియా విజ‌యం.. పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి ఐర్లాండ్‌..!
Advertisement

AUS vs IRE | టీ20 వరల్డ్ కప్‌ని ఆస్ట్రేలియా జ‌ట్టు విజ‌యంతో ప్రారంభించింది. కొలంబో వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఆసిస్ 67 ప‌రుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (6) త‌క్కువ స్కోర్‌కే వెనుదిరిగినా.. జోష్ ఇంగ్లిస్ (37; 17 బంతుల్లో), కామెరూన్ గ్రీన్ (21; 11 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను నిల‌బెట్టారు. తర్వాత మత్ రెన్షా (37) మరియు మార్కస్ స్టాయినిస్ (45) మధ్య 61 పరుగుల భాగస్వామ్యం న‌మోదు చేశారు. చివరి 5 ఓవర్లలో 53 పరుగులు జోడించడంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది.

ఐర్లాండ్ బౌల‌ర్ల‌లో మార్క్ అదిర్ 2, మాథ్యూ హంఫ్రీస్, ఆసీస్ 182/6కు చేరింది. ఐర్లాండ్ బౌలర్లు మధ్య ఓవర్లలో బాగా ఆడినా కొన్ని మిస్‌లు కారణంగా నష్టపోయారు. జార్జ్ డాక్రెల్‌, హ్యారీకి ఒక్కో వికెట్ ద‌క్కింది. ఆ త‌ర్వాత ల‌క్ష్య‌చేధ‌న‌లో న్యూజిలాండ్ 16.5 ఓవర్లలో 115 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయ్యింది. జార్జ్ డాక్రెల్ 41 పరుగులతో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మిగ‌తా బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ స‌హ‌కారం ఇవ్వ‌లేదు. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ గాయంతో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లు నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపాకు తలా నాలుగు వికెట్లు ద‌క్కాయి. మాథ్యూ కునెమన్ ఒక వికెట్ తీశాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా గ్రూప్ బీలో టాప్‌ స్థానంలోకి వచ్చింది. ఐర్లాండ్ రెండు మ్యాచుల్లో ఓట‌మితో నాలుగో స్థానానికి ప‌డిపోయింది.

Advertisement
Advertisement