త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asian Games 2026 | ఆసియా గేమ్స్‌ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు

Asian Games 2026 | ఆసియా గేమ్స్‌ స్క్వాష్‌లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు పతకాలు ఖాతాలో చేరాయి. పురుషుల సింగిల్స్‌లో అభయ్‌ సింగ్‌, మహిళల సింగిల్స్‌లో అనహత్‌ సింగ్‌ రజత పతకాలు సాధించగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జోష్నా చిన్నప్ప–వేలవన్‌ సెంథిల్‌కుమార్‌ జోడీ కాంస్యం గెలుచుకుంది.

P

Sports | Published On Sep 27, 2026, 5.23 pm IST

Asian Games 2026 | ఆసియా గేమ్స్‌ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు
Advertisement
  • అభయ్‌, అనహత్‌కు ర‌జ‌తాలు
  • జోష్నా–సెంథిల్‌కుమార్‌కు కాంస్యం

Asian Games 2026 | ఆసియా గేమ్స్‌ స్క్వాష్‌లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు పతకాలు ఖాతాలో చేరాయి. పురుషుల సింగిల్స్‌లో అభయ్‌ సింగ్‌, మహిళల సింగిల్స్‌లో అనహత్‌ సింగ్‌ రజత పతకాలు సాధించగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జోష్నా చిన్నప్ప–వేలవన్‌ సెంథిల్‌కుమార్‌ జోడీ కాంస్యం గెలుచుకుంది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంకర్‌ అభయ్‌ సింగ్‌కు మలేసియా ఆటగాడు, ప్రపంచ 18వ ర్యాంకర్‌ యో అంగ్‌ చేతిలో పరాజయం ఎదురైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ యో 11-9, 11-5, 11-5తో అభయ్‌ను ఓడించి స్వర్ణం నిలబెట్టుకున్నాడు. ఈ మలేసియా ఆటగాడిపై అభయ్‌కు ఇది వరుసగా ఎనిమిదో ఓటమి. బెస్ట్‌ ఆఫ్‌ ఫైవ్‌ విధానంలో జరిగిన మ్యాచ్‌లో మూడు గేమ్‌లు గెలిచిన ఆటగాడే విజేతగా నిలిచాడు.

అనహత్‌కు రజతం

మహిళల సింగిల్స్‌ ఫైనల్లో భారత యువ షట్లర్‌ అనహత్‌ సింగ్‌ 0-3తో మలేసియాకు చెందిన ప్రపంచ ఐదో ర్యాంకర్‌ శివసంగరి సుబ్రమణియం చేతిలో ఓడింది. శివసంగరి 11-4, 11-4, 11-7తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. గత ఆసియా గేమ్స్‌ చాంపియన్‌ అయిన శివసంగరికి అనహత్‌పై ఇది వరుసగా మూడో విజయం. సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన ప్రపంచ ఆరో ర్యాంకర్‌ సతోమి వతనాబేపై అనహత్‌ అద్భుతంగా పుంజుకుని విజయం సాధించినా.. ఫైనల్లో అదే జోరును కొనసాగించలేకపోయింది. అయితే ఆసియా గేమ్స్‌ చరిత్రలో మహిళల సింగిల్స్‌ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయురాలిగా అనహత్‌ రికార్డు సృష్టించింది. ప్రపంచ జూనియర్‌ టైటిల్‌ సాధించిన తొలి భారతీయురాలు కూడా ఆమెనే.

ఎల్‌ఏ ఒలింపిక్స్‌కు అర్హత

మలేసియా ఆటగాళ్లు యో అంగ్‌, శివసంగరి సుబ్రమణియం 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశించనున్న స్క్వాష్‌ విభాగానికి అర్హత సాధించిన తొలి ఇద్దరు క్రీడాకారులుగా చరిత్ర సృష్టించారు. ఆసియా గేమ్స్‌లో తమ స్వర్ణ పతకాలను కూడా నిలబెట్టుకున్నారు. ఇక స్క్వాష్‌ టీమ్‌ ఈవెంట్లలోనూ భారత్‌ పతకాలపై ఆశలు పెట్టుకుంది. పురుషుల జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.

Advertisement
Advertisement