Arjun-Saaniya Wedding | సచిన్ తనయుడు అర్జున్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్..!
Arjun-Saaniya Wedding | భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. కొద్ది రోజుల కిందట సానియా చందోక్‌తో మార్చి 5న వివాహ వేడుక జరుగనున్నట్లు సమాచారం. ఈ జంట గత ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు.
Arjun-Saaniya Wedding | భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. కొద్ది రోజుల కిందట సానియా చందోక్‌తో మార్చి 5న వివాహ వేడుక జరుగనున్నట్లు సమాచారం. ఈ జంట గత ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. సానియా ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనువరాలు. ఘాయ్ కుటుంబం హాస్పిటాలిటీ, ఫుడ్ సెక్టార్‌లో ప్రసిద్ధి. ఇంటర్ కాంటినెంటల్ హోటల్, ఐస్ క్రీం బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమరీ ఘాయ్ ఫ్యామిలీవే.
అర్జున్-సానియా నిశ్చితార్థ వేడుక ప్రైవేట్‌గా జరిగింది. ఆ తర్వాత ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సచిన్ సమాధానం ఇస్తూ ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని ధ్రువీకరించారు. నిశ్చితార్థం వేడుకకు సన్నహితులు, రెండు కుటుంబాలు మాత్రమే హాజరయ్యాయి. సానియా చందోక్ ముంబయిలోని బీడీ సోమానీ ఇంటర్నేషనల్ స్కూల్, ది కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లో స్కూల్ ఎడ్యుకేషస్‌ను పూర్తి చేసింది. ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో పట్టా అందుకుంది. 2020లో బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత వరల్డ్‌వైడ్ వెటర్నరీ సర్వీస్‌కు సంబంధించిన ఏబీసీ ప్రోగ్రామ్ నుంచి వెటర్నరీ టెక్నీషియన్‌గా సర్టిఫికేషన్ పొందింది.
జంతువులపై ఉన్న మక్కువతో సానియా 2022లో ముంబయిలో లగ్జరీ పెట్ గ్రూమింగ్, కేర్ బ్రాండ్ అయిన మిస్టర్ పావ్స్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్ఎల్‌పీని ప్రారంభించింది. ఇది కుక్కలు, పిల్లులకు సేవలను అందిస్తూ వస్తుంది. గ్రూమింగ్, స్పా, కొరియన్, జపనీస్ థెరపీలతో పెంపుడు జంతువులకు స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉంటుంది. ఇదే భారత్‌లో తొలి లగ్జరీ పెట్ స్పాగా పేరుంది. ఈ కంపెనీ వార్షిక ఆదాయం దాదాపు రూ. 90 లక్షలు కాగా.. ముంబయిలో రెండు బ్రాంచులున్నాయి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






