FIFA 2026 | మాకు అన్యాయం జరిగింది.. మెస్సీపై చర్యలు తీసుకోలేదని ఏఎఫ్ఎఫ్‌కు అల్జీరియా ఫిర్యాదు
FIFA 2026 | ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో తమకు అన్యాయం జరిగిందంటూ ఫుట్‌బాల్ సమాఖ్య (AFF) అల్జీరియా అధికారికంగా ఫిర్యాదు చేసింది. రిఫరీ నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పలు నివేదికలు తెలిపాయి.
FIFA 2026 | ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో తమకు అన్యాయం జరిగిందంటూ ఫుట్‌బాల్ సమాఖ్య (AFF) అల్జీరియా అధికారికంగా ఫిర్యాదు చేసింది. రిఫరీ నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పలు నివేదికలు తెలిపాయి. మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ సాధించి ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో 16 గోల్స్‌తో సంయుక్తంగా అగ్రస్థానానికి చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మెస్సీ ప్రదర్శన కంటే.. చేసిన ఫౌల్‌పైనే ఎక్కువ చర్చ జరిగింది. మ్యాచ్ సందర్భంగా మెస్సీ అల్జీరియా ఆటగాడు ఐస్సా మాండీ కాలి కండరంపై కాలుమోపినట్లు కనిపించిందని.. నేరుగా రెడ్‌కార్డ్ ఇవ్వాల్సిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అర్జెంటీనా కెప్టెన్‌పై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడాన్ని ఏఎఫ్‌ఎఫ్ తీవ్రంగా తప్పుబట్టింది.
అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్ మాక్ అలిస్టర్, అల్జీరియా ఆటగాడు ఇబ్రహీం మాజాపై మోచేతితో దాడి చేసిన ఘటనను కూడా రిఫరీ పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొంది. “మెస్సీ చేసిన టాకిల్‌కు రెడ్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సింది. అలాగే, రెండు మోచేతి దాడుల ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. వాటికీ ఆటగాళ్లను మైదానం నుంచి పంపించాల్సింది. అర్జెంటీనా బలమైన జట్టు కాదని తాము చెప్పడం లేదు. కానీ, అన్యాయం జరిగితే మౌనంగా ఉండలేం” అని టీమ్ ప్రతినిధి ఉటంకిస్తూ హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది. అల్జీరియాపై విజయం సాధించినా అర్జెంటీనా తర్వాతి మ్యాచ్‌లో జోర్డాన్‌తో తలపడనుంది. ఈ నెల 28న ఆర్లింగ్టన్‌లోని డల్లాస్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన జట్టుకు మరోసారి మెస్సీ కీలకం కానున్నాడు. తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్‌తో అదరగొట్టిన మెస్సీ అద్భుత ఫామ్‌లో ఉండడంతో జోర్డాన్‌తో జరిగే పోరులోనూ అందరి దృష్టి అతనిపైనే ఉన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Virat Kohli | ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ రెడీ.. 22న ఎక్సలెన్స్‌లో ఫిట్నెస్ టెస్ట్..
- ●Maheshkumar Goud | బీజేపీ గాడ్సే జపం చేస్తోంది.. అందుకే వ్యూహాలు పన్నుతున్నరు
- ●Combination Drugs | 16 కాంబినేషన్ మందులపై కేంద్రం నిషేధం.. వెంటనే అమలు..
- ●Mock Drill | నీట్ రీ ఎగ్జామ్.. దేశ వ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ నిర్వహించిన ఎన్టీఏ
- ●Rukmini Vasanth | రుక్మిణి వసంత్ డీప్ ఫేక్ బికినీ వీడియో - ముగ్గురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
- ●Cantonment Land Scam | కంటోన్మెంట్లో రూ.800 కోట్ల ల్యాండ్ స్కామ్.. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు

Virat Kohli | ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ రెడీ.. 22న ఎక్సలెన్స్‌లో ఫిట్నెస్ టెస్ట్..

Maheshkumar Goud | బీజేపీ గాడ్సే జపం చేస్తోంది.. అందుకే వ్యూహాలు పన్నుతున్నరు

Combination Drugs | 16 కాంబినేషన్ మందులపై కేంద్రం నిషేధం.. వెంటనే అమలు..

Mock Drill | నీట్ రీ ఎగ్జామ్.. దేశ వ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ నిర్వహించిన ఎన్టీఏ





