Agarkar Vs BCCI | అగార్కర్–బీసీసీఐ మధ్య విభేదాలు.. తెరపైకి కీలక విషయాలు..!
Agarkar Vs BCCI | టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగింపు దశకు చేరుకున్న వేళ.. బీసీసీఐతో ఆయనకు ఉన్న విభేదాలపై పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెంగాల్‌కు చెందిన ది టెలిగ్రాఫ్ ఇండియా కథనం ప్రకారం.. నియామకం జరిగిన కొద్ది రోజులకే అగార్కర్‌కు, బోర్డుకు మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి.
Agarkar Vs BCCI | టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగింపు దశకు చేరుకున్న వేళ.. బీసీసీఐతో ఆయనకు ఉన్న విభేదాలపై పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెంగాల్‌కు చెందిన ది టెలిగ్రాఫ్ ఇండియా కథనం ప్రకారం.. నియామకం జరిగిన కొద్ది రోజులకే అగార్కర్‌కు, బోర్డుకు మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. 2023 జూలైలో చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్.. ఐర్లాండ్ పర్యటనలో జస్‌ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని తొలుత వ్యతిరేకించినట్లు నివేదిక తెలిపింది. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తున్న బుమ్రాపై కెప్టెన్సీ భారం మోపకూడదని అగార్కర్ భావించారట. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని సూచించినట్లు తెలిపింది. బుమ్రా కెప్టెన్సీకి సిద్ధంగా ఉన్నందున అతడికే అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావించడంతో.. చివరకు బుమ్రానే ఐర్లాండ్ పర్యటనలో సారథ్యం వహించాడు.
రోహిత్ భవిష్యత్తుపైనా భేదాభిప్రాయాలు
ఆ తర్వాత కూడా సెలక్షన్ వ్యవహారాల్లో అగార్కర్, బీసీసీఐ మధ్య పలు అంశాల్లో విభేదాలు కొనసాగినట్లు టెలిగ్రాఫ్ పేర్కొంది. సెలక్షన్‌లో బయటి జోక్యాన్ని అగార్కర్ వ్యతిరేకించినట్లు తెలిపింది. ముఖ్యంగా రోహిత్ శర్మ భవిష్యత్తు, 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతడి స్థానం అంశం ఉద్రిక్తతలను మరింత పెంచినట్లుగా వెల్లడించింది. అయితే, రోహిత్ కొనసాగింపునకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా బహిరంగంగా మద్దతు ప్రకటించడం గమనార్హం. బీసీసీఐతో పాటు వీవీఎస్ లక్ష్మణ్‌తోనూ అగార్కర్‌కు విభేదాలు ఉన్నట్లు కథనం పేర్కొంది. లక్ష్మణ్ నేతృత్వంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై సెలక్షన్ సమావేశాల్లో అగార్కర్ ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలిపింది. ఆటగాళ్ల గాయాలు, పునరావాస ప్రక్రియపైనా ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు వెల్లడించింది. సెప్టెంబర్ ఆరంభంలో జరిగిన కీలక బీసీసీఐ సమీక్ష సమావేశానికి అగార్కర్ హాజరుకాకపోవడం కూడా చర్చనీయాంశమైంది. గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, టెస్టు-వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సమావేశంలో పాల్గొన్నారు. అగార్కర్ అందుబాటులో లేకపోవడంపై సైకియా స్పందిస్తూ.. ఆయన నగరంలో లేరని, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతంలో ఉండటంతో ఆన్‌లైన్‌లోనూ సమావేశానికి హాజరుకాలేకపోయారని తెలిపారు.
విజయాలూ ఘనమే..
అయితే అగార్కర్ పదవీకాలాన్ని కేవలం వివాదాల కోణంలోనే చూడలేమని గణాంకాలు చెబుతున్నాయి. ఆయన నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జట్లు గత మూడేళ్లలో నాలుగు ఐసీసీ వైట్‌బాల్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరాయి. 2023 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్‌కు చేరగా.. మూడు టోర్నీల్లో విజేతగా నిలిచింది. అగార్కర్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐలో కొంతకాలంగా అనిశ్చితి నెలకొన్నట్లు ది టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది. బోర్డు ఆయన కొనసాగింపుపై ఆసక్తిగా లేదని, మరోవైపు అగార్కర్ కూడా పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపలేదని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. అనంతరం ఆయన పదవీకాలాన్ని పొడిగించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. రోహిత్ వ్యవహారం, లక్ష్మణ్‌తో విభేదాలు, సెలక్షన్‌లో బీసీసీఐ జోక్యంపై వచ్చిన ఆరోపణలపై బోర్డు ఇప్పటివరకు ఎలాంటి సమగ్ర అధికారిక వివరణ ఇవ్వలేదు. వివాదాల మధ్య అగార్కర్ పదవీకాలం ముగింపు దశకు చేరినా.. మూడు ఐసీసీ టైటిళ్లు, నాలుగు ఫైనల్స్ మాత్రం ఆయన చీఫ్ సెలెక్టర్‌గా సక్సెస్ ఫుల్‌గా పదవీకాలాన్ని పూర్తి చేయడం విశేషం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం
- ●Ayodhya Ram Temple Donation Theft | పాపం మహమ్మద్ గజనీ భారతదేశంపై దండెత్తి దోచుకుంది కేవలం 17 సార్లే
- ●ACB Raids | 15 వేలకు కక్కుర్తి పడి.. ఏసీబీ వలకు చిక్కి
- ●Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్
- ●TG Weather | బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో ఈ నెల 27 దాకా అతిభారీ వర్షాలు..
- ●DoT SIM Card Misuse Fine | మీ సిమ్ కార్డు వేరేవాళ్లు వాడుతున్నారా? రూ.50 లక్షల ఫైన్, జైలు శిక్ష తప్పదు

Vakiti Srihari | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్నాం

Ayodhya Ram Temple Donation Theft | పాపం మహమ్మద్ గజనీ భారతదేశంపై దండెత్తి దోచుకుంది కేవలం 17 సార్లే

ACB Raids | 15 వేలకు కక్కుర్తి పడి.. ఏసీబీ వలకు చిక్కి

Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా - రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్





