త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AFG vs UAE | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అఫ్ఘ‌నిస్థాన్ బోణీ.. యూఏఈపై 5 వికెట్ల విజ‌యం..

AFG vs UAE | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఎట్ట‌కేల‌కు అఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు బోణీ చేసింది. యూఏఈతో జ‌రిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెన‌ర్లు ఇబ్ర‌హీం జ‌ద్రాన్‌, అజ్మ‌తుల్లా ఒమ‌ర్జాయ్ అద్భుతంగా బ్యాటింగ్ చేయ‌డంతో తొలి విజ‌యాన్ని అందుకుంది. ఈ విక్ట‌రీతో సూప‌ర్ 8 ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది.

P

Sports | Published On Feb 16, 2026, 3.48 pm IST

AFG vs UAE | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అఫ్ఘ‌నిస్థాన్ బోణీ.. యూఏఈపై 5 వికెట్ల విజ‌యం..
Advertisement

AFG vs UAE | టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఎట్ట‌కేల‌కు అఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు బోణీ చేసింది. యూఏఈతో జ‌రిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెన‌ర్లు ఇబ్ర‌హీం జ‌ద్రాన్‌, అజ్మ‌తుల్లా ఒమ‌ర్జాయ్ అద్భుతంగా బ్యాటింగ్ చేయ‌డంతో తొలి విజ‌యాన్ని అందుకుంది. ఈ విక్ట‌రీతో సూప‌ర్ 8 ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగులు చేసింది. ఆ త‌ర్వాత అఫ్ఘ‌నిస్థాన్ జ‌ట్టు 19.2 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి 162 ప‌రుగులు చేసి గెలుపొందింది. అఫ్ఘ‌న్ జ‌ట్టు విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో భారీ మార్పులు జ‌రిగాయి. మూడు మ్యాచుల్లో రెండు పాయింట్ల‌తో అఫ్ఘ‌నిస్తాన్ మూడోస్థానానికి చేరుకుంది. యూఏఈ నాలుగో స్థానానికి ప‌డిపోయింది. ఇక ఆ జ‌ట్టు కెన‌డాతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. సూప‌ర్ 8లోకి ప్ర‌వేశించాలంటే త‌ప్ప‌నిస‌రిగా కెన‌డాపై విజ‌యం సాధించాలి. అదే స‌మ‌యంలో కెన‌డాతో న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌నున్న‌ది. కివీజ్ జ‌ట్టు గెలిస్తే ద‌క్షిణాఫ్రికాతో క‌లిసి త‌ర్వాతి రౌండ్‌లోకి వెళ్తుంది. అఫ్ఘ‌నిస్తాన్ పోరాటం ముగుస్తుంది.

యూఏఈ విధించిన 161 ప‌రుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన అఫ్ఘ‌నిస్తాన్‌కు ఇన్నింగ్స్ రెండో బంతికే ఎదురుదెబ్బ త‌గిలింది. జునైద్ సిద్దిఖీ బౌలింగ్‌లో షోయ‌బ్‌కు క్యాచ్ ఇచ్చి ర‌హ్మానుల్లా గుర్బాజ్ డ‌కౌట్ అయ్యాడు. మ‌రో ఓపెన‌ర్ హైద‌ర్ అలీ వేసిన నాలుగో ఓవ‌ర్‌లో జ‌ద్రాన్ మూడు ఫోర్లు, సిక్స‌ర్ బాది 18 ప‌రుగులు రాబ‌ట్టాడు. గుల్బాదిన్ న‌యీబ్ (13) మొహ‌మ్మ‌ద్ జ‌వాదుల్లా బౌలింగ్‌లో సిక్స‌ర్‌, ఫోర్ కొట్టాడు. ఆ త‌ర్వాత అర్ఫాన్ బౌలింగ్‌లో హ‌ర్షిక్ కౌశిక్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప‌వ‌ర్ ప్లేలో అఫ్ఘ‌నిస్తాన్ రెండు విక‌ట్ల న‌ష్టానికి 41 ప‌రుగులు చేసింది. జ‌ద్రాన్ 37 బంతుల్లో హాఫ్ చేసిన త‌ర్వాత వెనుదిరిగాడు. జ‌ద్రాన్ 41 బంతుల్లో ఆరు ఫోర్లు, సిక్స‌ర్ స‌హాయంతో 53 ప‌రుగులు చేశాడు. అత‌నికి ఆ త‌ర్వాత దర్విష్ రసూలి (33) స‌హ‌కారం అందించాడు. చివ‌ర‌లో అజ్మ‌తుల్లా ఒమ‌ర్జాయ్ 21 బంతుల్లో మూడు సిక్స‌ర్లు, రెండు ఫోర్ల‌తో నాటౌట్‌గా నిలిచి జ‌ట్టును గెలిపించాడు. సిద్దిఖీ అట‌ల్ (16), మ‌హ్మ‌ద్ న‌బీ మూడుప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు.

అంత‌కుముందు అఫ్ఘ‌నిస్థాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. యూఏఈ త‌ర‌ఫున సొహైబ్ ఖాన్ 48 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్ల‌తో 68 ప‌రుగులు చేయ‌డంతో యూఏఈ మోస్త‌రు టార్గెట్‌ను నిర్దేశించ‌గ‌లిగింది. సోహైబ్‌తో పాటు యూఏఈ త‌ర‌ఫున అలీషాన్ షరాఫు 31 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఒమర్జాయ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, ముజీబ్ ఉర్ రెహమాన్ ఒక వికెట్, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు. రషీద్ టీ20లో 700 వికెట్లు ప‌డగొట్టాడు.

Advertisement
Advertisement