త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs PAK | పాక్‌తో హైవోల్టేజ్ మ్యాచ్‌కు అభిషేక్ శ‌ర్మ రెడీ..! వెల్ల‌డించిన సూర్య‌కుమార్‌

IND Vs PAK | పాక్‌తో ఆదివారం హైవోల్టేజ్ మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. ఈ కీల‌క మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది. విధ్వంసంక ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆడ‌నున్నాడు. ఈ విష‌యాన్ని టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు.

P

Sports | Published On Feb 14, 2026, 6.36 pm IST

IND Vs PAK | పాక్‌తో హైవోల్టేజ్ మ్యాచ్‌కు అభిషేక్ శ‌ర్మ రెడీ..! వెల్ల‌డించిన సూర్య‌కుమార్‌
Advertisement

IND Vs PAK | పాక్‌తో ఆదివారం హైవోల్టేజ్ మ్యాచ్ జ‌రుగ‌నున్న‌ది. ఈ కీల‌క మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్ అందింది. విధ్వంసంక ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఆడ‌నున్నాడు. ఈ విష‌యాన్ని టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు. ఇటీవ‌ల అభిషేక్ క‌డుపునొప్పి బారిన‌ప‌డి ఢిల్లీ ఆసుప‌త్రిలో జాయిన్ అయిన విష‌యం తెలిసిందే. దాంతో న‌మీబియాతో మ్యాచ్‌కు దూర‌మ్యాడు. ఆరోగ్య స‌మ‌స్య‌ల నుంచి కోలుకున్న అభిషేక్ ప్ర‌స్తుతం ఫిట్‌గా ఉన్నాడు. పాక్‌తో జ‌రిగే మ్యాచ్‌లో ఆడేందుకు ప్రాక్టీస్ సెష‌న్‌లోనూ పాల్గొన్నాడు. మ్యాచ్‌కు ముందు జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో సూర్య మాట్లాడుతూ.. టీమ్ మేనేజ్‌మెంట్ అత‌న్ని ఆడించాల‌నుకుంటే రేప‌టి మ్యాచ్ ఆడుతాడ‌ని పేర్కొన్నారు.

పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ ఆఘా సైతం అభిషేక్ కోలుకుంటాడ‌ని ఆశిస్తున్నాన‌ని.. సాధ్య‌మైనంత బెస్ట్ జ‌ట్టుతో తాము ఆడాల‌ని కోరుకుంటున్న‌ట్లు వ్యాఖ్యానించ‌గా.. ఈ మేర‌కు సూర్య‌కుమార్ ఈ ప్ర‌క‌ట‌న చేశాడు. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత.. ఆసియా క‌ప్‌లో పాకిస్తాన్ ప్లేయ‌ర్స్‌తో టీమిండియా ఆట‌గాళ్లు క‌ర‌చాల‌నం చేసేందుకు నిరాక‌రించారు. ఆ త‌ర్వాత పెద్ద వివాద‌మే చెల‌రేగింది. తాజాగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో క‌ర‌చాల‌నం చేస్తారా? అన్న ప్ర‌శ్న‌కు సూర్య‌కుమార్ యాద‌వ్ స‌మాధానం ఇవ్వ‌లేదు. స‌మాధానం కోసం 24గంట‌లు ఆగాల‌ని.. మంచి క్రికెట్ ఆడి.. ఆపై ఈ విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పాడు. బాగా నిద్ర‌పోవాల‌ని.. బాగా తినాల‌ని.. 24 గంట‌లు వేచి ఉండండి అంటూ సూర్య వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉండ‌గా.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శ‌ర్మ‌ను తుది జ‌ట్టులోకి తీసుకుంటే.. మ‌రో ఓపెన‌ర్ సంజు శాంస‌న్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ ప‌క్క‌నే పెట్టే అవ‌కాశం ఉంది. న‌మీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ దూరం కాగా.. సంజు శాంస‌న్‌ను తుది జ‌ట్టులోకి తీసుకున్నారు. అయితే, ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విజృంభించినా.. త‌క్కువ స్కోర్‌కే వెనుదిరిగ‌డంతో ఈ మ్యాచ్‌లో ప‌క్క‌న పెట్టే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది.

Advertisement
Advertisement