Abhishek Sharma | వరుసగా మూడోసారి డకౌట్.. చెత్త రికార్డును నెలకొల్పిన అభిషేక్ శర్మ..!
Abhishek Sharma | ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ కనీసం ఒక్క పరుగు చేయలేకపోయాడు. టోర్నీకి ముందు అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ బ్యాట్స్‌మెన్ మూడు మ్యాచుల్లో డకౌట్లతో నిరాశ పరిచాడు.
Abhishek Sharma | ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ కనీసం ఒక్క పరుగు చేయలేకపోయాడు. టోర్నీకి ముందు అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ బ్యాట్స్‌మెన్ మూడు మ్యాచుల్లో డకౌట్లతో నిరాశ పరిచాడు. అహ్మదాబాద్‌లో బుధవారం నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అమెరికాతో జరిగిన భారత తొలి మ్యాచ్‌లో అభిషేక్ గోల్డెన్ డక్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కడుపు సమస్యతో ఆసుపత్రిలో చేరాడు. దాంతో నమీబియా మ్యాచ్‌కు దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. నాలుబు బంతులు ఆడిన అభిషేక్ మళ్లీ సున్నా స్కోర్‌కే పెవిలియన్‌కు చేరాడు. తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులోనూ సున్నా స్కోర్‌కే వెనుదిరిగి చెత్త రికార్డును నెలకొల్పాడు.
ఏడు ఇన్నింగ్స్‌లో అభిషేక్ స్కోర్లు ఇలా..
టీ20 ఇంటర్నేషనల్స్‌లో చివరి ఏడు ఇన్నింగ్స్‌లో అభిషేక్ స్కోర్లు ఇలా ఉన్నాయి. 0(3), 0(4), 0(1), 30(16), 0(1), 68*(20), 0(1). ఈ ఫార్మాట్‌లో అభిషేక్‌కు ఇది తొమ్మిదో డకౌట్. ఇప్పటివరకు 40 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 1,297 పరుగులు సాధించాడు. స్ట్రయిక్ రేట్ 192.43గా ఉన్నది. మొత్తం టీ20 క్రికెట్ 14వ డక్ కావడం విశేషం. క్రిక్‌బజ్ సమాచారం ప్రకారం.. మెన్స్ టీ20 ఇంటర్నేషనల్ ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక డకౌట్‌లు అయిన ఓపెనర్ల జాబితాలో అభిషేక్ రెండో స్థానంలో నిలిచాడు. సైమ్ అయూబ్ (పాకిస్తాన్-2025) ఆరు డకౌట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. చలోయెమ్‌వాంగ్ చాట్‌ఫైసన్ (థాయిలాండ్-2024), కుశాల్ భూర్టెల్ (నేపాల్-2024), ధర్మ కేసుమా (ఇండోనేషియా-2025), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ (బంగ్లాదేశ్-2025)తో కలిసి సంయుక్తంగా అభిషేక్ శర్మ (భారత్-2026) రెండోస్థానంలో ఉన్నాడు.
రెండో భారతీయుడిగా చెత్త రికార్డు..
టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో వరుసగా మూడు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ చేరాడు. ఈ రికార్డు సాధించిన రెండో టీమిండియా ప్లేయర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఆశిష్ నెహ్రా (భారత్, 2010–2016) అభిషేక్ కంటే ముందున్నాడు. ఆండ్రీ ఫ్లెచర్ (WI, 2009), రోజర్ ముకాసా (UGA, 2024) అభిషేక్ శర్మ (IND, 2025) ఉన్నారు. ఈ ఏడాది ఎనిమిది టీ20 మ్యాచుల్లో అభిషేక్ 182 పరుగులు చేశాడు. సగటు 26 కాగా.. స్ట్రైక్‌రేట్ 224.69గా ఉంది. ఇందులో ఐదు డకౌట్స్ ఉన్నాయి. పొట్టి కప్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో అభిషేక్ శర్మ తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






