Vozinha | స్పెయిన్‌ను నిలువరించిన 40 ఏళ్ల గోల్‌కీపర్.. ఎవరీ వొజిన్హా..?
Vozinha | ఫుట్‌బాల్ ప్రపంచంలో యువ సంచలనాలైన లామిన్ యమాల్, నికో విలియమ్స్ తదితర కొత్త తరం ఆటగాళ్లపై చర్చ సాగుతున్న వేళ.. 40 సంవత్సరాల గోల్‌కీపర్ ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. కేప్‌వెర్డే సీనియర్ ప్లేయర్ అయిన గోల్‌కీపర్ వొజిన్హా (Vozinha) స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు.
Vozinha | ఫుట్‌బాల్ ప్రపంచంలో లామిన్ యమాల్, నికో విలియమ్స్ వంటి యువ సంచలనాలు వార్తల్లో నిలుస్తున్న వేళ.. 40 ఏళ్ల గోల్‌కీపర్ ఒక్క మ్యాచ్‌తో ప్రపంచ ఫుట్‌బాల్ దృష్టిని ఆకర్షించాడు. కేప్‌వెర్డే సీనియర్ ప్లేయర్ అయిన గోల్‌కీపర్ వొజిన్హా (Vozinha) స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్-2026లో కేప్‌వెర్డే ఆడిన తొలి మ్యాచ్‌లోనే వరల్డ్ ర్యాకింగ్స్‌లో మూడోస్థానంలో ఉన్న యూరప్ చాంపియన్ స్పెయిన్‌ను 0-0 తేడాతో నిలువరించి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో వొజిన్హా కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌లో మొత్తం ఏడుసార్లు గోల్‌పడకుండా అడ్డుకొని స్పెయిన్ ప్రయత్నాలను అడ్డుకొని నిరాశకు గురి చేశాడు. నిరాశకు గురి చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోవడం విశేషం.
అడ్డుగోడలా నిలిచిన వోజిన్హా

అట్లాంటా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ప్రారంభం నుంచే కేప్‌వెర్డేపై ఆధిపత్యాన్ని చూపించింది. టికిటాకా శైలిలో బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచుకొని మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నించింది. మ్యాచ్ మొత్తంలో స్పెయిన్ 27 ప్రయత్నాలు చేసినా ఒక్కదాన్ని గోల్‌గా మలచలేకపోయింది. కేప్‌వెర్డే డిఫెన్స్ నిలబడలేకపోయిన సందర్భాల్లోనూ వోజిన్హా ముందుకొచ్చి గోల్‌ను కాపాడాడు. ద్వితీయార్థంలో బార్సిలోనా యువ సంచలనం లామిన్ యమాల్ మైదానంలోకి వచ్చినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. మ్యాచ్ ముగిసిన వెంటనే వోజిన్హా భావోద్వేగానికి లోనయ్యాడు. గోల్‌పోస్ట్‌ను ఆనుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లు అతడిని అభినందిస్తూ కౌగిలించుకున్నారు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగిన స్పెయిన్ నుంచి ఒక పాయింట్ దక్కించుకోవడం కేప్‌వెర్డేకు గొప్ప విజయంగా నిలిచింది. మ్యాచ్ తర్వాత మాట్లాడిన వోజిన్హా.. “ఈ క్షణం కోసం నా జీవితమంతా కష్టపడ్డాను. మునుపటి తరాలు దీని కోసమే కలలు కన్నా సాధించలేకపోయాయి. ఇప్పుడు ఆ కల నిజమైంది” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
భారీగా పెరిగిన ఫాలోవర్స్..

మ్యాచ్‌కు ముందు వోజిన్హా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య కేవలం 50వేలు మాత్రమే ఉండేంది. స్పెయిన్‌తో మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో అతని పేరు మార్మోగింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే తన ఫాలోవర్ల సంఖ్య లక్షల్లోకి చేరింది. కొద్ది గంటల్లోనే ఆ సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం 6.6 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ చేరారు. మొత్తానికి ఒక్క రాత్రిలోనే స్టార్ ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు.
25 ఏళ్ల వయసులో కెరీర్ షురూ..

వోజిన్హా అసలు పేరు జోసిమార్ డయాస్. 1986 జూన్ 3న కేప్‌వెర్డేలోని మిండెలో నగరంలో జన్మించాడు. చిన్నతనం నుంచే ‘వోజిన్హా’ అనే పేరుతో ఫేమస్ అయ్యాడు. అతని తండ్రి సైన్యంలో పనిచేయగా, తల్లి ఉద్యోగం చేయడంతో ఎక్కువ కాలం తాతయ్య, అమ్మమ్మ వద్దే పెరిగాడు. ఫుట్‌బాల్ అకాడమీల్లో శిక్షణ పొందకుండా వీధుల్లో, స్థానిక మైదానాల్లో స్నేహితులతో ఆడుతూ తన ప్రతిభ చాటాడు. 25 ఏళ్ల వయసులో అంగోలా క్లబ్ ప్రోగ్రెసో తరఫున ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేశాడు. అనంతరం మోల్డోవా, సైప్రస్, స్లోవేకియా, పోర్చుగల్ దేశాల్లోని పలు క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం పోర్చుగల్ రెండో డివిజన్ క్లబ్ జీడీ చావ్స్ తరఫున ఆడుతున్నాడు.
‘అమ్మమ్మ’ పేరే గుర్తింపుగా..

వోజిన్హా కథలో మరో ఆసక్తికర విషయం అతని పేరు. పోర్చుగీస్ భాషలో ‘వోజిన్హా’ అంటే ‘అమ్మమ్మ’ అని అర్థం. చిన్నప్పుడు తోటి పిల్లలు అతడిని ఈ పేరుతో ఆటపట్టించేవారు. వారు అలా పిలిస్తే ఏడుస్తూ తన తాతయ్య, అమ్మమ్మల వద్దకు వెళ్లేవాడట. ఆ పేరే కాలక్రమేణా అతనికి గుర్తింపుగా మారిపోయింది. ఇప్పుడు అదే వోజిన్హా ప్రపంచ ఛాంపియన్ అయిన స్పెయిన్‌ను ఓ ఆట ఆడుకున్న హీరోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. టోర్నీలో కేప్‌వెర్డే ప్రయాణం ఎలా సాగుతుందో చూడాల్సిందే. అయితే, ఈ సారి ఫిపా వరల్డ్ కప్ చరిత్రలో గుర్తుండిపోయే కథల్లో వోజిన్హా పేరు మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోవడం ఖాయం.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
జులై 19, 2026

Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
జులై 19, 2026

FIFA 2026 | ఫిఫా ప్రపంచకప్ ఫైనల్.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం
జులై 19, 2026
తాజావార్తలు
- ●Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్

Harish Rao | రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ : హరీశ్‌రావు

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?



