Red Stripe on Tablets | మందులపై ఎర్ర గీత ఎందుకు ఉంటుంది? దీని అర్థం ఏంటో 90శాతం మందికి తెలియదు..!
Red Stripe on Tablets | ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చిన సమయంలో వైద్యుల సూచనలు, లేదంటే మెడికల్ షాప్‌కి వెళ్లి మందులు కొనగడం సాధారణమైన విషయమే. అయితే, కొన్ని మందుల కవర్లపై ఎర్ర గీత ఉంటుంది. దాన్ని చాలా మంది పట్టించుకోరు. అది ఎందుకు ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపించరు.
Red Stripe on Tablets | ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చిన సమయంలో వైద్యుల సూచనలు, లేదంటే మెడికల్ షాప్‌కి వెళ్లి మందులు కొనగడం సాధారణమైన విషయమే. అయితే, కొన్ని మందుల కవర్లపై ఎర్ర గీత ఉంటుంది. దాన్ని చాలా మంది పట్టించుకోరు. అది ఎందుకు ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపించరు. కేవలం డిజైన్‌గానే భావించి పట్టించుకోరు. కానీ, ఈ రెడ్ కలర్ స్ట్రిప్ కీలక హెచ్చరికకు గుర్తని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఏదైనా మందుల కవర్‌పై ఈ స్ట్రిప్ కనిపిస్తే వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే కొనుగోలు చేయాలి. ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వంటి శక్తివంతమైన మందులపై ఈ ఎర్ర గీత ఉంటుంది. వీటిని అవసరం లేకుండా, సొంతంగా తీసుకోవడం వల్ల శరీరంలో ‘డ్రగ్ రెసిస్టెన్స్’ అనే సమస్య పెరుగుతుంది. దాంతో భవిష్యత్తులో సాధారణంగా పనిచేసే మందులు కూడా ప్రభావం చూపించకపోయే ప్రమాదం ఉంటుంది. చట్టపరంగా కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ తరహా మందులను విక్రయించడం నిషేధం.
ఎందుకంత ముఖ్యం..?

చాలా మంది చిన్న జలుబు, దగ్గు వంటి సమస్యలకే యాంటీబయాటిక్స్ వాడడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ రకమైన సొంత వైద్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం మందులపై ఎర్రని స్ట్రిప్ హెచ్చరికగా అమలు చేస్తోంది. ఈ మందులను అధిక మోతాదులో, తప్పుగా వాడితే మూత్రపిండాలు, కాలేయం సంబంధిత సమస్యలు, అలర్జీలు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఎంతకాలం, ఏ మోతాదులో మందులు వాడాలో వైద్యుడే నిర్ణయించాలి. మందుల ప్యాకెట్‌పై ‘Rx’ గుర్తు ఉంటే అది తప్పనిసరిగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమని అర్థం. ‘NRx’ గుర్తు ఉన్న మందులు మత్తు పదార్థాలకు చెందినవిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటిని వాడే సమయంలో మరింత జాగ్రత్త అవసరం. అలాగే మందుల తయారీ తేదీ, గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
సూచనలు..

ఎవరి సలహాతోనైనా, సొంత వైద్యం, పాత ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఎర్ర గీత ఉన్న మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయకూడదు. ప్రతి సారి ఆరోగ్య సమస్యలు ఎదురైన సందర్భంలో వైద్యుడిని సంప్రదించడం అవసరం. వైద్యుడు సూచించినప్పుడే ఈ మందులను వినియోగించాలి. అలాగే, ఒకసారి యాంటీబయాటిక్, ఎర్ర గీత ఉన్న మందులను ప్రారంభించిన తర్వాత, లక్షణాలు తగ్గినా మధ్యలో ఆపేయకుండా పూర్తి కోర్సును తప్పనిసరిగా వాడాలి. లేకపోతే శరీరంలో బ్యాక్టీరియా పూర్తిగా నశించకపోవడంతో వ్యాధి మళ్లీ రావడం, అలాగే మందులకు ప్రతిరోధక శక్తి (డ్రగ్ రెసిస్టెన్స్) పెరగడం వంటి ప్రమాదాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026

CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
జులై 4, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



