Solar System | సౌరకుటుంబంలో రహస్యమైన ఐదోశక్తి..! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..?
Solar System | సౌర వ్యవస్థలో ఓ రహస్యమైన ఐదో శక్తి ఉందా అంటే ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ పరికరాలకు చిక్కకుండా వస్తోంది. ప్రస్తుతం ప్రకృతిలో గురుత్వాకర్షణ, విద్యుత్ అయస్కాంత శక్తి, బలమైన అణుశక్తి, బలహీన అణుశక్తి అనే నాలుగు ప్రాథమిక శక్తులను గుర్తించారు. వీటికి మించి మరో శక్తి ఉండొచ్చన్న అనుమానాలు తాజాగా మళ్లీ తెరపైకి వచ్చాయి.
Solar System | సౌర వ్యవస్థలో ఓ రహస్యమైన ఐదో శక్తి ఉందా అంటే ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. సాధారణ పరికరాలకు చిక్కకుండా వస్తోంది. ప్రస్తుతం ప్రకృతిలో గురుత్వాకర్షణ, విద్యుత్ అయస్కాంత శక్తి, బలమైన అణుశక్తి, బలహీన అణుశక్తి అనే నాలుగు ప్రాథమిక శక్తులను గుర్తించారు. వీటికి మించి మరో శక్తి ఉండొచ్చన్న అనుమానాలు తాజాగా మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ ‘ఐదో శక్తి’ విశ్వానికి సంబంధించిన కొన్ని ప్రధాన రహస్యాలను అర్థం చేసుకోవడంలో కీలకంగా మారవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా విశ్వ విస్తరణకు కారణమవుతున్నట్లు భావిస్తున్న ‘డార్క్ ఎనర్జీ’ స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడవచ్చని పేర్కొంటున్నారు. అయితే, డార్క్ ఎనర్జీ అసలు ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు.

సుదూరంగా గ్యాలక్సీలను పరిశీలిస్తున్న సమయంలో గురుత్వాకర్షణలో కొన్ని విభిన్న లక్షణాలు కనిపించాయి. ఇవి ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలకు పూర్తిగా సరిపోవడం లేదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే, మన సౌరవ్యవస్థలో మాత్రం గురుత్వాకర్షణ సాధారణంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విరుద్ధ పరిస్థితి శాస్త్రవేత్తలకు సవాల్‌గా మారింది. ఈ పరిస్థితినే ‘గ్రేట్ డిస్కనెక్ట్’గా పిలుస్తున్నారు. అంటే, భౌతిక శాస్త్ర నియమాలు అన్ని స్థాయిల్లో ఒకే విధంగా పనిచేయకపోవడం అన్నమాట. విశ్వం పెద్ద స్థాయిలో ఒకలా, స్థానికంగా మరోలా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ అంశంపై నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ స్లావా టురిషెవ్ పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
ఆయన అభిప్రాయం ప్రకారం.. ఇప్పటివరకు దూర విశ్వ పరిశీలనలపై ఆధారపడిన అధ్యయనాలను మించి, ఇకపై సౌరవ్యవస్థలోనే ప్రత్యక్ష పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రత్యేక అంతరిక్ష మిషన్లను రూపకల్పన చేయాల్సి ఉండొచ్చని సూచించారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. పదార్థం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కొత్త ప్రభావాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఖాళీ ప్రాంతాల్లో గురుత్వ ప్రభావం స్వల్పంగా మారుతున్నట్లు సంకేతాలు లభిస్తున్నాయి. అయితే గ్రహాలు వంటి పదార్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించడం లేదు.

ఇదిలా ఉండగా విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉన్నదన్న విషయం ఇప్పటికే స్థిరపడింది. ఈ విస్తరణకు కారణమవుతున్న శక్తిగా ప్రస్తుతం డార్క్ ఎనర్జీని భావిస్తున్నప్పటికీ, దాని అసలు స్వరూపం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఐదో శక్తి ఉనికిని నిర్ధారించేందుకు మరింత సున్నితమైన పరికరాలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరికరాలతో సూక్ష్మ మార్పులను గుర్తించడం కష్టమని, దశలవారీగా మెరుగైన సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ పరిశోధనలు స్పష్టమైన ఫలితాలు ఇస్తే, గురుత్వాకర్షణపై ఇప్పటి వరకు మనకు తెలిసిన దాంట్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. విశ్వ విస్తరణ, డార్క్ ఎనర్జీ వంటి అంశాలపై కొత్త విషయాలు పడవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు

Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?





