GHMC | ప్రజలు ఈ – వేస్ట్‌ను స్వచ్ఛందంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి అప్పగించాలి: కమిషనర్ ఆర్వీ కర్ణన్
GHMC | త్రినేత్ర.న్యూస్ : నగరంలోని ప్రజలు తమ ఈ - వేస్ట్‌ను స్వచ్ఛందంగా జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బందికి అప్పగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ (Commissioner) ఆర్వీ కర్ణన్ (RV Karnan) పిలుపునిచ్చారు. ముషీరాబాద్ సర్కిల్‌లోని బాగ్‌లింగంపల్లిలో నిర్వహిస్తున్న మెగా ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్‌ను కర్ణన్ సోమవారం సందర్శించారు.
GHMC | త్రినేత్ర.న్యూస్ : నగరంలోని ప్రజలు తమ ఈ - వేస్ట్‌ను స్వచ్ఛందంగా జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బందికి అప్పగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ (Commissioner) ఆర్వీ కర్ణన్ (RV Karnan) పిలుపునిచ్చారు. ముషీరాబాద్ సర్కిల్‌లోని బాగ్‌లింగంపల్లిలో నిర్వహిస్తున్న మెగా ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్‌ను కర్ణన్ సోమవారం సందర్శించారు. అక్కడి ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, శాస్త్రీయంగా నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ - వేస్ట్ సేకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలలో పరిస్థితిని పరిశీలించారు. క్షేత్రస్థాయి సిబ్బందితో మాట్లాడి, ప్రత్యేక వాహనాలు, ప్రత్యేక కౌంటర్ల పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కర్ణన్ మాట్లాడుతూ పాత, వినియోగంలో లేని ఎలక్ట్రానిక్ వస్తువులను నిర్దేశిత సేకరణ కేంద్రాల్లో అప్పగించాలని సూచించారు. అశాస్త్రీయంగా ఈ - వేస్ట్‌ను పారవేయడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతో పాటు ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. సోమవారం ప్రారంభమైన ఈ స్పెషల్ డ్రైవ్ మంగళవారంతో ముగుస్తుందని చెప్పారు. ఐటీ ప్రాంతాలు, ఎలక్ట్రానిక్ దుకాణాలు అధికంగా ఉన్న ప్రదేశాలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇప్పటికే జోనల్, డిప్యూటీ కమిషనర్ లు క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించారని వివరించారు. ఈ - వేస్ట్ ఇష్టారీతిన పడేయడం వలన వచ్చే అనర్ధాలను వివరించి ప్రజలను చైతన్యపరచాలన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






