NASA | అంగారక గ్రహంపై విచిత్ర వస్తువు..!
NASA | అంగారక గ్రహంపై కనిపించిన ఓ విచిత్ర వస్తువు కనిపించింది. ఈ వస్తువు శాస్త్రవేత్తలందరినీ షాక్‌కు గురి చేసింది. నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ తీసిన ఒక పాత చిత్రంలో మెరుపులు మెరుస్తున్న సిలిండర్ ఆకారపు వస్తువు కనిపించింది.
NASA | అంగారక గ్రహంపై కనిపించిన ఓ విచిత్ర వస్తువు కనిపించింది. ఈ వస్తువు శాస్త్రవేత్తలందరినీ షాక్‌కు గురి చేసింది. నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ తీసిన ఒక పాత చిత్రంలో మెరుపులు మెరుస్తున్న సిలిండర్ ఆకారపు వస్తువు కనిపించింది. ఆ వస్తువు ఏంటో తెలుసుకునేందుకు మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆస్ట్రోఫిజిసిస్ట్ అవి లోయెబ్ సూచించారు. ఈ వస్తువు అసలు ఏమిటో తెలుసుకునేందుకు రోవర్‌ను మళ్లీ ఆ ప్రాంతానికి దారి మళ్లించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ చిత్రం 2022 ఆగస్టు 7న మార్స్‌లోని గేల్ క్రేటర్ పరిసరాల్లోని “పారైటెపుయ్ పాస్” ప్రాంతంలో క్యూరియాసిటీ రోవర్ మాస్ట్ కెమెరా ద్వారా తీసింది. దాదాపు 20 సెంటీమీటర్ల పొడవున్న ఈ సిలిండర్ ఆకారపు వస్తువు మెరిసే ఉపరితలంతో చుట్టుపక్కల ఉన్న రాతి నేలపై ప్రత్యేకంగా కనిపిస్తోంది. మొదట్లో ఫొటోను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. నాసా ఆర్కైవ్‌ను మార్స్ పరిశోధకుడు రామి బార్ ఇలాన్ వస్తువును గుర్తించారు. తర్వాత ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ జాన్ స్పేసెక్ దీన్ని అవి లోయెబ్ దృష్టికి తీసుకురావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంలో లోయెబ్ స్పందిస్తూ.. “ఇది సాధారణంగా వదిలేయాల్సిన మానవ నిర్మిత అవశేషమా? నిజంగా కొత్త ఆవిష్కరణకు దారి తీసే అంశమా?” అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రోవర్ చేస్తున్న పరిశోధనల కంటే ఈ అనుమానాస్పద వస్తువును పరిశీలించడం ప్రాధాన్యంశంగా తీసుకోవాలన్నారు. ప్రజల పన్నుల డబ్బుతో నడిచే నాసా ఇలాంటి మిస్టరీలను ఛేదించడంలో ముందుండాలన్నారు. అయితే, ఈ వస్తువు పూర్తిగా కొత్తదై ఉండకపోవచ్చని లోయెబ్ స్వయంగా పేర్కొన్నారు. క్యూరియాసిటీ రోవర్ ల్యాండింగ్ సమయంలో ఉపయోగించిన స్కై క్రేన్, హీట్ షీల్డ్, ఇతర పరికరాల నుంచి విడిపోయిన భాగం కావచ్చని ఆయన అంచనా వేశారు. గాలికి కొట్టుకుపోయి అక్కడికి చేరి ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటివరకు ఈ విషయంపై నాసా నుంచి అధికారిక స్పందించాల్సి ఉంది.
సంబంధిత వార్తలు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
జులై 26, 2026

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
జులై 26, 2026

CWG 2026 | గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్లిఫ్ట్లో భారత్‌కు సిల్వర్..!
జులై 26, 2026
తాజావార్తలు
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ



