త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NASA | మార్స్‌పై వింత ఆకారం రాయి..! ఫొటో తీసి పంపిన క్యూరియాసిటీ రోవ‌ర్‌..!

NASA | అంగార‌క గ్ర‌హంపైకి నాసా పంపిన క్యూరియాసిటీ రోవ‌ర్ అధ్య‌య‌నం కొన‌సాగిస్తున్న‌ది. ఇప్ప‌టికే ఈ రోవ‌ర్ మార్స్ గ్ర‌హానికి సంబంధించిన వివ‌రాలు, ఫొటోలు సైతం తీసి పంపింది. ఈ ఫొటోలు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి. తాజాగా ఈ రోవ‌ర్ ప‌గ‌డం (coral) ఆకారంలో ఉన్న చిన్న బండ‌రాయిని గుర్తించింది.

P

Science | Published On Jan 30, 2026, 11.22 am IST

NASA | మార్స్‌పై వింత ఆకారం రాయి..! ఫొటో తీసి పంపిన క్యూరియాసిటీ రోవ‌ర్‌..!
Advertisement

NASA | అంగార‌క గ్ర‌హంపైకి నాసా పంపిన క్యూరియాసిటీ రోవ‌ర్ అధ్య‌య‌నం కొన‌సాగిస్తున్న‌ది. ఇప్ప‌టికే ఈ రోవ‌ర్ మార్స్ గ్ర‌హానికి సంబంధించిన వివ‌రాలు, ఫొటోలు సైతం తీసి పంపింది. ఈ ఫొటోలు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి. తాజాగా ఈ రోవ‌ర్ ప‌గ‌డం (coral) ఆకారంలో ఉన్న చిన్న బండ‌రాయిని గుర్తించింది. ఇది చిన్నదే అయినప్పటికీ, ఆకారం అందరిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న‌ది. ఆ రాయి ఆకారం భూమిపైనున్న స‌ముద్ర జీవుల‌ను పోలి ఉన్న‌ది. ఇది జీవం ఉంద‌నేందుకు ఆధారం మాత్రం కాద‌ని.. గ‌తంలో ద్ర‌వ జ‌లం ఉండేద‌ని సూచిస్తుంద‌ని శాస్త్రవేత్త‌లు పేర్కొంటున్నారు.

మార్స్‌పై క్యూరియాసిటీ రోవ‌ర్ పంపిన ఈ బండరాయి ఫొటో ప‌డ‌గ‌పు జీవిలా క‌నిపిస్తుంద‌ని.. గాలి, నీరు, ర‌సాయ‌న చ‌ర్య‌ల కార‌ణంగానే కోట్ల సంవ‌త్స‌రాలుగా ఇలా రూపాంత‌రం చెంది ఉండ‌వ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు. ప‌గ‌డ‌పు ఆకారం శిల గ‌తంలో నీరు ఉంద‌ని సూచిస్తుందంటున్నారు. ఈ రాయి ఎన్నో సంవ‌త్స‌రాలుగా అంగార‌క గ్ర‌హం ఉప‌రిత‌లంపై జ‌రుగుతున్న మార్పుల‌ను అర్థం చేసుకునేందుకు స‌హాయ‌ప‌డుతుంద‌ని చెబుతున్నారు. ఇలాంటి నిర్మాణాలు భ‌విష్య‌త్ మిష‌న్‌లు, ల్యాండింగ్ సైట్స్‌ను ఎంపిక చేసుకునేందుకు మార్గ‌నిర్దేశం చేస్తాయంటున్నారు.

నాసా ఈ క్యూరియాసిటీ రోవ్‌ను న‌వంబ‌ర్ 26, 2011న ఫ్లోరిడాలోని కేప్ కెనావెర‌ల్ నుంచి ప్ర‌యోగించింది. 2012 ఆగ‌స్టు 6న అంగార‌క గ్ర‌హంపైనున్న గేల్ క్రేట‌ర్‌లో దిగింది. ఈ రోవర్ ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 34 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో విలువైన డేటాను భూమిపైకి పంపింది. ప‌ది సంవ‌త్స‌రాలు దాటినా ఇంకా ఈ రోవ‌ర్ అంగార‌క గ్ర‌హం ఈ రోవ‌ర్ వాతావ‌ర‌ణంపై అధ్య‌య‌నం చేస్తున్న‌ది. మార్స్‌పై గ‌తంలో జీవం ఉంద‌నేదానికి సంబంధించిన ఆధారాల‌ను పంపిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement