త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Comet C-2024 E1 | ఆకాశంలో అతిథి..! చూసేందుకు రెడీగా ఉండండి..!

Comet C-2024 E1 | అంత‌రిక్షంలో ఎన్నో గ్ర‌హ‌శ‌క‌లాలు చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటాయి. ఇందులో కొన్ని భూమి దిశ‌గా దూసుకువ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఎన్నో ప్ర‌మాద‌క‌ర‌మైన ఆస్ట‌రాయిడ్స్ భూమి ద‌గ్గ‌ర‌గా నుంచి వెళ్లిపోయాయి. అయితే, తాజాగా భారీ ఆస్ట‌రాయిడ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

P

Science | Published On Feb 15, 2026, 2.54 pm IST

Comet C-2024 E1 | ఆకాశంలో అతిథి..! చూసేందుకు రెడీగా ఉండండి..!
Advertisement

Comet C-2024 E1 | అంత‌రిక్షంలో ఎన్నో గ్ర‌హ‌శ‌క‌లాలు చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటాయి. ఇందులో కొన్ని భూమి దిశ‌గా దూసుకువ‌స్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఎన్నో ప్ర‌మాద‌క‌ర‌మైన ఆస్ట‌రాయిడ్స్ భూమి ద‌గ్గ‌ర‌గా నుంచి వెళ్లిపోయాయి. అయితే, తాజాగా భారీ ఆస్ట‌రాయిడ్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మంచు, దుమ్ముతో నిండిన ఊర్ట్ క్లౌడ్ నుంచి బయలుదేరిన సీ/2024 ఈ1 తోకచుక్క ఈ నెల 17న భూమికి అత్యంత చేరువగా రానుంది. ద‌క్షిణ భార‌త‌దేశ వాసులు ఈ అతిథిని ఆకాశంలో వీక్షించే అవ‌కాశం ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొంటున్నారు.

ఈ ఆస్ట‌రాయిడ్‌ను 2024 మార్చిలో పోలండ్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త కాస్పెర్ వెర్జో గుర్తించారు. అమెరికా అరిజోనాలో నిర్వహిస్తున్న ‘కటలీనా స్కై సర్వే’లో భాగమైన మౌంట్ లెమన్ పరిశీలన కార్యక్రమంలో ఆకాశాన్ని జ‌ల్లెడ ప‌డుతున్న స‌మ‌యంలో ఈ గ్ర‌హ‌శ‌క‌లం ఆయ‌న దృష్టిని ఆక‌ర్షించింది. సౌరమండలాన్ని చుట్టుముట్టి సుమారు 1.58 కాంతి సంవత్సరాల దూరం వరకూ వ్యాపించి ఉన్న మంచు, రాళ్లు, దుమ్ముతో కూడిన విశాల వలయాన్ని ఊర్ట్ క్లౌడ్‌గా పిలుస్తారు. అక్కడి నుంచే ఈ తోకచుక్క తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది జనవరి 20న ఇది సూర్యునికి కేంద్ర‌బిందువైన ‘పెరీహీలియన్’కి చేరుకుంది. సూర్యుడికి దాదాపు 8.5 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి చేరింది. సూర్యుడు, గ్రహాల గురుత్వాకర్షణ ప్రభావంతో దాని గమనం మారిపోయిందని, ఇక భవిష్యత్తులో ఇది మళ్లీ సౌర కుటుంబంలోకి వచ్చే అవకాశాలు చాలా స్వల్పమని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

గత ఏడాది ఫిబ్రవరిలో ఈ తోకచుక్క స్పష్టమైన చిత్రాలు లభించాయి. జనవరి 1న శుక్రగ్రహం సమీపంగా దూసుకెళ్లింది. ఫిబ్రవరి 17న భూమికి అత్యంత చేరువగా రానుంది. ఆ రోజున రాత్రి సమయంలో నైరుతి దిశలో ఆకాశాన్ని పరిశీలిస్తే ఈ దృశ్యం కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ధనుస్సు రాశి (సాగిటేరియస్) నక్షత్ర మండ‌లం ప్రాంతంలో గుర్తించ‌వ‌చ్చ‌ని పేర్కొంటున్నారు. ఈ గ్ర‌హ‌శ‌క‌లం ఆకుచ‌ప్చ‌ని కాంతితో మెరుస్తూ.. తోక భాగం నీలిరంగులో తళుక్కుమంటూ కనిపిస్తుంది. తోకలో ఉన్న వాయువులు, ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్, సూర్యకాంతి తాకడంతో ప్రకాశిస్తాయి. అప్పుడు ఆ తోకచుక్క మన కంటికి స్పష్టంగా దర్శనమిస్తుంది. ఈ తోకచుక్క గుండ్రటి కేంద్రకం వెడల్పు సుమారు 2 నుంచి 10 కిలోమీటర్ల మధ్య ఉండొచ్చని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Advertisement
Advertisement