Artemis-2 Mission | రాకెట్ ఫ్యూయల్ టెస్ట్ విజయవంతం.. మార్చిలో దూసుకెళ్లనున్న ఆరెమిస్ట్-2..!
Artemis-2 Mission | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆర్టెమిస్-2 మిషన్ మార్చిలో నిర్వహించబోతున్నది. ఇటీవల సాంకేతిక సమస్యలతో మిషన్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. రాకెట్‌లో ఇంధనం నింపునుతున్న సమయంలో లీకేజీని గుర్తించారు. దాంతో మిషన్‌ని వాయిదా వేయాల్సి వచ్చింది.
Artemis-2 Mission | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆర్టెమిస్-2 మిషన్ మార్చిలో నిర్వహించబోతున్నది. ఇటీవల సాంకేతిక సమస్యలతో మిషన్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. రాకెట్‌లో ఇంధనం నింపునుతున్న సమయంలో లీకేజీని గుర్తించారు. దాంతో మిషన్‌ని వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా శుక్రవారం ఫ్యూయెలింగ్ రీహర్సల్ విజయవంతంగా నిర్వహించారు. రాకెట్‌లో 7లక్షల గ్యాన్లకుపైగా సూపర్ కూల్ ఇంధనాన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ మిళితం చేశారు.
రెండువారాల కిందల తొలిసారిగా రీహార్సల్స్ సమయంలో లిక్విడ్ హైడ్రోజన్ లాంచ్ ప్యాడ్, రాకెట్ కనెక్షన్‌లో ప్రమాదకరంగా లీక్ అయ్యింది. దాంతో సమస్యను పరిష్కరించేందుకు మిషన్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా ఇంజినీర్లు రెండు సీల్స్, జామ్ అయిన ఫిల్టర్‌ను మార్చారు. ప్రస్తుతం ఆశించిన దాని కంటే మెరుగ్గా పని చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం టెస్ట్ డేటాను సమీక్షిస్తూ.. మిషన్‌లో ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మిషన్‌లో భాగంగా నలుగురు ఆస్ట్రోనాట్స్ నింగిలోకి దూసుకెళ్లనున్నారు. మిషన్ ప్రారంభానికి ముందు క్రూ సభ్యులు శుక్రవారం నుంచి రెండువారాల క్వారంటైన్‌లో ఉంటారు. అన్నీ అనుకూలంగా ఉంటే మిషన్ మార్చి 6న నిర్వహించాలని నాసా యోచిస్తోంది. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ దూసుకెళ్తుంది.
క్రూలో నలుగురు వ్యోమగాములు..
క్రూలో నలుగురు వ్యోమగాములు పదిరోజుల పాటు చంద్రుడిని చుట్టి వస్తారు. 1972లోని అపోలో మిషన్ తర్వాత తొలిసారిగా నాసా మూన్ మిషన్ చేపడుతోంది. అయితే, ఈ సారి మాత్రం చంద్రుడిపై దిగడం లేదు. ఆర్టెమిస్-2 నాసా అపోలో మిషన్ తర్వాత చేపడుతున్న రెండో మూన్ మిషన్. ఈ మిషన్‌లో వ్యోమగాములు రీడ్ వైజ్‌మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్‌తో పాటు కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి జెరెమీ హాన్సన్ చంద్రుడి వద్దకు వెళ్తారు. ఈ మిషన్ లక్ష్యం భవిష్యత్తులో చంద్రుడిపై ల్యాండింగ్ కోసం మనుషులను సిద్ధం చేయడం. ఈ ప్రయాణంలో రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ పనితీరును అంచనా వేస్తున్నారు. ఆర్టెమిస్-3 మూన్ మిషన్ ప్రీప్రిపరేషన్‌లో కీలకమైన ముందడుగుగా గా భావిస్తున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






