త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కేసు న‌మోదుకు 8 గంట‌లు ఎందుకు ప‌ట్టింది.. రేవంత్ స‌మాధానం చెప్పాలి: హ‌రీశ్‌రావు

Harish Rao | మైనర్ బాధితురాలు త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దీనికి స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

S

News | Published On May 10, 2026, 1.48 pm IST

Harish Rao | కేసు న‌మోదుకు 8 గంట‌లు ఎందుకు ప‌ట్టింది.. రేవంత్ స‌మాధానం చెప్పాలి: హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: మైనర్ బాధితురాలు త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిల‌దీశారు. హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దీనికి స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ మేర‌కు బాలిక ఘ‌ట‌న‌పై హ‌రీశ్ రావు ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా అని నిల‌దీశారు. బండి కుమారుడిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రేవంత్‌రెడ్డి హోం శాఖ‌ను త‌న చేతిలో పెట్టుకొని శాంతిభ‌ద్ర‌త‌ల‌ను గాలికొదిలేశార‌ని మండిప‌డ్డారు. మైన‌ర్ కేసుల్లోనూ ఇంత నిర్ల‌క్ష్యం ఏంట‌ని ప్ర‌శ్నించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వెంటనే విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement