MP Chamala Kiran Kumar Reddy | అసలు బండి సంజయ్‌ది ఏ గ్రహం? ఆయనతో తెలంగాణకు ఏం లాభం: బండి సంజయ్‌కు ఎంపీ చామల కౌంటర్
MP Chamala Kiran Kumar Reddy | మాజీ మంత్రి జీవన్‌రెడ్డి (Jeevan Reddy) పార్టీ మార్పుపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పార్టీలది రాహు, కేతు గ్రహం అని బండి సంజయ్ అంటున్నారని, అసలు బండిది ఏ గ్రహం? ఆయన నవ గ్రహాల్లో ఉన్నారా? అంటూ ఎద్దేవా చేశారు.
MP Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి (Jeevan Reddy) పార్టీ మార్పుపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పార్టీలది రాహు, కేతు గ్రహం అని బండి సంజయ్ అంటున్నారని, అసలు బండిది ఏ గ్రహం? ఆయన నవ గ్రహాల్లో ఉన్నారా? అంటూ ఎద్దేవా చేశారు. బండితో తెలంగాణకు ఏం ప్రయోజనం? అని అన్నారు. మంగళవారం ఎంపీ చామల మాట్లాడారు.
మీరు నిధులు తెచ్చే సభ పెట్టండి..
బండి సంజయ్ ప్రెస్ మీట్లకే పరిమితం అవుతాడు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా బండి సంజయ్? మెట్రో ఫేజ్-2, ట్రిపుల్ఆర్, మూసీ ప్రక్షాళన విషయంలో మీ వైఖరి ఏంటి? భువనగిరి లోక్‌సభ పరిధిలో నిధులు తీసుకువచ్చే సభ బండి సంజయ్, కిషన్ రెడ్డి కలిసి పెట్టండి. పార్టీలకు అతీతంగా ప్రజలను తీసుకువచ్చే బాధ్యత మాది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకు ఆదేశిస్తే 24 గంటల్లో విచారణ చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. 2025, ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇస్తే ఇప్పటి వరకు విచారణ ఎందుకు చేయడం లేదు? అవసరం లేని వాటికి మీ జేబు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీని వాడుతున్నారు. బండి సంజయ్ శాఖ పరిధిలోనే సీబీఐ ఉంది కదా? అని చామల ప్రశ్నించారు.
బండి సంజయ్ ఏ గ్రహమో చెప్పి తెలంగాణకు ఏం ప్రయోజనమో చెప్పాలి. కాళేశ్వరం కుప్పకూలింది. కాళేశ్వరంలో బీఆర్ఎస్ లక్ష కోట్లు దోచుకుంది. కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం అన్న బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బండి సంజయ్ ఎంపీగా, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం ఏటీఎంగా మారడానికి అక్కడ ఏముంది? బండి సంజయ్ అని నిలదీశారు.
నిన్నటితో జీవన్‌రెడ్డి పండగ అయిపోయింది...
జీవన్ రెడ్డి ఆలోచన లేని పని చేశారు. కేసీఆర్ జీవన్ రెడ్డికి జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేయాలని అనుకుంది. నిన్నటితో జీవన్ రెడ్డి పండుగ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో అలిగినట్లు బీఆర్ఎస్ పార్టీలో అలిగితే పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీలో అలిగితే పీసీసీ ప్రెసిడెంట్,ఏఐసీసీ సెక్రటరీలు జగిత్యాల దాకా వచ్చారు. జనరల్ సెక్రటరీ పదవికి కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయి ఉంటుందో జీవన్ రెడ్డికి తెలుసు. పొన్నాల లక్ష్మయ్య పీసీసీ ప్రెసిడెంట్ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? చివరకు పొన్నాల లక్ష్మయ్య వీడియోలు చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారు. రేపు జీవన్ రెడ్డి పరిస్థితి అంతే అవుతుంది అని చామల జోస్యం చెప్పారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



