CM Prajavani | అడవిని విడిచి బతకలేం.. పులులతోనే కలిసి ఉంటం: సీఎం ప్రజావాణిలో చెంచులు
CM Prajavani | అడవి తల్లి ఒడిలోనే నివాసం ఉంటాం.. పులులతో మమేకం అవుతాం.. తరతరాలుగా నివాసం ఉంటున్న అటవీ ప్రాంతాన్ని వదిలి బయట ప్రాంతంలో జీవించలేం.. మమ్మల్ని ఇక్కడే బతకనివ్వండి' అని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ATR) ప్రాంతం చెంచులు (Chenchu tribe) స్పష్టం చేశారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జి.చిన్నారెడ్డి(G. Chinna Reddy)ని కలిసి తమ సమస్యలను తెలిపారు.
త్రినేత్ర.న్యూస్: 'అడవి తల్లి ఒడిలోనే నివాసం ఉంటాం.. పులులతో మమేకం అవుతాం.. తరతరాలుగా నివాసం ఉంటున్న అటవీ ప్రాంతాన్ని వదిలి బయట ప్రాంతంలో జీవించలేం.. మమ్మల్ని ఇక్కడే బతకనివ్వండి' అని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ATR) ప్రాంతం చెంచులు (Chenchu tribe) స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి (CM Prajavani) కార్యక్రమానికి వచ్చిన ఏటీఆర్ ప్రాంత చెంచు జాతి గిరిజనులు తమ సమస్యలను తెలియజేశారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జి.చిన్నారెడ్డి(G. Chinna Reddy)ని కలిసి తమ సమస్యలను తెలిపారు.
వందల ఏండ్లుగా అడవి తల్లిని నమ్ముకుని అడవుల్లోనే నివసిస్తున్నామని.. టైగర్ రిజర్వ్ కోసం చెంచు పెంటలను ఖాళీ చేసి బయటి ప్రాంతానికి వెళ్లి జీవించలేమన్నారు. అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నా పులులతో కలిసి జీవించేందుకూ తాము సిద్ధమే అని చెప్పారు. కానీ చెంచు పెంటలను మాత్రం బలవంతంగా ఖాళీ చేయించొద్దని చెంచులు సార్లపల్లి పెంట చిగుర్ల మల్లికార్జున్, రాయిలేటి పెంట మండ్లి చిట్టెమ్మ, కొమ్మనపెంట చిగురుల నాగమ్మ, సార్లపల్లి పెంట కుడుముల తిరుపతయ్య కోరారు. అటవీ చట్టాలను శాఖ పరంతో పాటు చెంచు పెంటలకు కూడా వర్తింపజేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
చెంచుల అభీష్టం మేరకే ముందుకు..
ఈ విషయంపై డాక్టర్ జి చిన్నారెడ్డి స్పందిస్తూ.. చెంచులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చెంచుల అభీష్టం మేరకు ముందుకు సాగుతామని భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్రతో చిన్నారెడ్డి ఫోన్ లో సంప్రదించగా చెంచు కుటుంబాలను అటవీ ప్రాంతం నుంచి బలవంతంగా ఖాళీ చేయించే ప్రసక్తే లేదని వెల్లడించారు. అటవీ అధికారులు, చెంచులతో సమావేశం కోసం చిన్నారెడ్డి షెడ్యూల్ ను ఖరారు చేయించారు. ఈ భేటీలో రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి హర్ష, ప్రవాసి ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రజావాణిలో 401 దరఖాస్తులు..
కాగా 214వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 401 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 110, రెవెన్యూ శాఖకు 72, ఇందిరమ్మ ఇండ్ల కోసం 125, ప్రవాసీ ప్రజావాణికి 2 చొప్పున దరఖాస్తులు సమర్పించారు. ఇతర శాఖలకు సంబంధించి 92 దరఖాస్తులు వచ్చాయి. జి.చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సూర్య ప్రకాష్, ఏసీపీ ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ప్రవాసీ ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





