Virosh | విజయ్, రష్మిక గ్లోబల్ రికార్డ్ – మెస్సీ, రొనాల్డోను దాటేసిన విరోష్
పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న క్రేజ్ నేషనల్ నుంచి గ్లోబల్ లెవెల్ చేరుకుంది. వీరిద్దరు కలిసి నటించిన ఓ యాడ్ తాలూకు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు రికార్డు స్థాయిలో లైక్స్ వచ్చాయి. మెస్పీ, రొనాల్డో వంటి దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్లను దాటేశారు.
Virosh | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి వేడుకలు దాదాపు పది రోజుల పాటు జరిగాయి. ఉదయ్‌పూర్‌లో విజయ్, రష్మిక పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటుచేశారు. పెళ్లి తర్వాత తెలంగాణ సంప్రదాయాలను పాటిస్తూ సత్యనారాయణ స్వామితో పాటు ఇతర పూజలను విజయ్, రష్మిక జంటగా చేశారు. పెళ్లితో విరోష్ క్రేజ్ నేషనల్ వైడ్‌కు చేరింది. వివాహ వేడుకతో పాటు రిసెప్షన్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి. రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పెళ్లి ఫొటోలకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వచ్చాయి. 25 మిలియన్ల తో ఇండియాలోనే హయ్యెస్ట్ లైక్స్ వచ్చిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌గా నిలిచింది. కోహ్లితో పాటు పలువురు సెలిబ్రిటీలను దాటేశారు.
పెళ్లికి ముందు...
తాజాగా విరోష్ జోడీ మరో రికార్డును నెలకొల్పారు. ఈ సారి మెస్సీ, రొనాల్డో వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ అధిగమిస్తూ గ్లోబల్ లెవెల్‌లో సెన్సేషన్‌గా నిలిచారు. పెళ్లికి కొద్ది రోజుల ముందు విజయ్, రష్మిక కలిసి మాన్యవార్ ఫ్యాషన్ బ్రాండ్ యాడ్‌లో కలిసి నటించారు. ఇందులో ట్రెడిషనల్ లుక్‌లో విజయ్, రష్మిక కనిపించారు. విరోష్ కెమిస్ట్రీ ఈ యాడ్‌కు హైలైట్‌గా నిలిచింది. విజయ్, రష్మిక పెళ్లి తర్వాత ఇటీవలే ఈ యాడ్ రిలీజైంది. రిలీజై ఐదారు రోజులు అవుతోన్న ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్, రష్మిక చేసిన మాన్యవార్ యాడ్ పోస్ట్‌కు 8.1 మిలియన్ లైక్స్, 104 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
మెస్సీ...రొనాల్డో...
గ్లోబల్ వైడ్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో హయ్యెస్ట్ లైక్స్ వచ్చిన యాడ్ పోస్ట్‌గా నిలిచింది. ఫుట్ బాల్ స్టార్స్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్ కు మించిన లైక్స్ విరోష్ చేసిన మాన్యవార్ కపుల్ యాడ్ పోస్ట్ కు రావడం గమనార్హం. విరోష్ జంటకు ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఈ రికార్డ్ నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపుతున్నట్లు సమాచారం.
రణబాలి మూవీ....
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి రణబాలి సినిమా చేస్తోన్నారు. హిస్టారికల్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 12 నుంచి విజయ్, రష్మిక రణబాలి షూటింగ్‌లో తిరిగి జాయిన్ కానున్నట్లు సమాచారం. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్, రష్మిక కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ ఇది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Naga Durga | నాగదుర్గ తెలుగు మూవీ షూటింగ్ షురూ – ఇడుపు కాయితం రిలీజ్ డేట్ ఇదేనా ?
జులై 11, 2026

Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ – నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ – ప్రొడ్యూసర్‌గా హీరో నాని
జులై 11, 2026

Bhagyashri Borse | లెనిన్ సక్సెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ బోర్సే – హైదరాబాద్ నా కర్మభూమి అంటూ కామెంట్స్
జులై 11, 2026
తాజావార్తలు
- ●Naga Durga | నాగదుర్గ తెలుగు మూవీ షూటింగ్ షురూ - ఇడుపు కాయితం రిలీజ్ డేట్ ఇదేనా ?
- ●Meta | మెటా యూటర్న్.. ప్రైవసీ విమర్శలతో ఏఐ ఇమేజ్ ఫీచర్‌కు గుడ్‌బై..
- ●Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి
- ●Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
- ●EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..
- ●Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని

Naga Durga | నాగదుర్గ తెలుగు మూవీ షూటింగ్ షురూ - ఇడుపు కాయితం రిలీజ్ డేట్ ఇదేనా ?

Meta | మెటా యూటర్న్.. ప్రైవసీ విమర్శలతో ఏఐ ఇమేజ్ ఫీచర్‌కు గుడ్‌బై..

Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి

Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!



