Telugu web series review | వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన కానిస్టేబుల్ కనకం వెబ్‌సిరీస్ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌కు సీజన్ 2 వచ్చింది. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రాజీవ్ కనకాల, మేఘమాల ప్రధాన పాత్రల్లో నటించిన కానిస్టేబుల్ కనకం సీజన్ 2కు ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించాడు. సెకండ్ సీజన్ ఎలా ఉందంటే? చంద్రిక మిస్సింగ్... అడవి గుట్ట మిస్టరీని కనకం ఛేదించడంతో కానిస్టేబుల్ కనకం సీజన్ వన్ ముగిసింది. ఈ క్రమంలో చంద్రిక (మేఘమాల) మిస్సవుతుంది. ఆమె చనిపోయిందని రేపల్లే ఊరందరూ అనుకుంటారు. కానీ కనకం (వర్ష బొల్లమ్మ) మాత్రం చంద్రిక బతికే ఉందని నమ్ముతుంది. ఆమె తల్లిదండ్రులను కలుస్తుంది. ఈ క్రమంలో చంద్రికకు ఆమె పోలికలతోనే సహస్ర అనే సోదరి ఉందనే నిజం బయటపడుతుంది. చంద్రిక సహస్రలలో మిస్సయ్యింది ఎవరు? చంద్రిక ఇంట్లో పనిచేసిన వసుధకు ఈ మిస్సింగ్‌కు ఎలాంటి సంబంధం ఉంది? చివరకు ఈ మిస్టరీని కనకం ఎలా ఛేదించింది? తన జన్మరహస్యం గురించి కనకానికి ఎలాంటి షాకింగ్ నిజం తెలిసింది? అన్నదే సీజన్ 2 కథ. నాలుగు ఎపిసోడ్స్... కానిస్టేబుల్ కనకం సీజన్ 1కు కొనసాగింపుగానే డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దిమ్మల సీజన్ 2ను తెరకెక్కించారు. కేవలం నాలుగు ఎపిసోడ్స్ తక్కువ రన్టైమ్తో సీజన్ 2ను ఎండ్ చేశారు. చంద్రిక ఏమైంది? ఆమె మిస్సింగ్ వెనకున్న ఒక్కో క్లూను సేకరిస్తూ కనకం ఎలా నిజం బయటపెట్టింది అన్నది సెకండ్ సీజన్ కథ. ట్విస్ట్‌లు, టర్న్‌లు... సీజన్ వన్‌తో పోలిస్తే ఇందులో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది. చంద్రిక, సహస్ర ట్వీన్స్ అంటూ వచ్చే ఫ్యామిలీ డ్రామా, వసుధ ఫ్లాష్‌బ్యాక్ అంత కన్వీన్సింగ్‌గా కనిపించవు. చంద్రిక తల్లిదండ్రుల ప్రవర్తన అనుమానస్పదంగా చూపిస్తూ సస్పెన్స్ క్రియేట్ చేయాలని చూశారు. అది అంతగా వర్కవుట్ కాలేదు. ఇలాంటి ఇన్వేస్టిగేషన్ డ్రామాల్లో హీరోనో...హీరోయిన్లో తన తెలివితేటలతో క్రిమినల్‌ను కనిపెడితే బాగుంటుంది. ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఎంగేజ్ చేయాలి. . అలాంటి మ్యాజిక్లేవి లేకుండా ఫ్లాట్‌గా సాగుతుంది. హీరోయిన్ నేరుగా హీరోయిన్ విలన్ ఇంటికి వెళ్లిపోడం, కనకాన్ని చూడటానికి కథ మొత్తం చెప్పేయడం సిల్లీగా అనిపిస్తుంది. సీజన్ 2 హడావిడిగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. విలన్ జైలు నుంచి తప్పించుకునే సీన్‌తో ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్‌తో కానిస్టేబుల్ కనకానికి సీజన్ మూడో సీజన్ కూడా ఉండబోతున్నట్లు హింట్ ఇచ్చారు. రాజీవ్ కనకాలతో చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నా ఎవరిని సరిగ్గా వాడుకోలేదు. వర్ష బొల్లమ్మ, మేఘలేఖ ఈ ఈ ఇద్దరి పాత్రల చుట్టే ఎక్కువగా తిరిగింది. ఎమోషనల్ యాక్టింగ్‌తో వర్ష బొల్లమ్మ మెప్పించింది. వసుధ పాత్రకు సంబంధించిన ట్విస్ట్ ఓకే అనిపిస్తుంది. మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయి. థ్రిల్లర్ సిరీస్‌లను ఇష్టపడే ఆడియెన్స్‌ను కొంత వరకు కానిస్టేబుల్ కనకం మెప్పిస్తుంది. వర్ష బొల్లమ్మ యాక్టింగ్ కోసం చూడొచ్చు.