త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cricket | చెల‌రేగిన‌ వైభ‌వ్ సూర్య‌వంశీ… భార‌త్ భారీ స్కోరు

Cricket | దుబాయ్ (Dubai)లో జ‌రుగుతున్న అండ‌ర్ - 19 (Under - 19) ఆసియాక‌ప్ (Asia Cup) లో యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Suryavanshi) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోతున్నాడు. యూఏఈతో జ‌రిగిన మ్యాచ్‌లో 95 బంతుల్లో 171 ప‌రుగులు చేయ‌గా, అరోన్ జార్జి, విహాన్ మ‌ల్హోత్రాలు హాఫ్ సెంచ‌రీ బాద‌డంతో భార‌త్ నిర్దేశిత 50 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 433 ప‌రుగులు సాధించింది.

A

News | Published On Dec 12, 2025, 2.44 pm IST

Cricket | చెల‌రేగిన‌ వైభ‌వ్ సూర్య‌వంశీ… భార‌త్ భారీ స్కోరు
Advertisement

Cricket | ఆసియాక‌ప్‌ (Asia Cup)లో భార‌త్ (India) భారీ స్కోరు సాధించింది. యువ‌సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Suryavanshi) చెల‌రేగిపోయాడు. దుబాయి (Dubai)లోని ఐసీసీ అకాడ‌మీ గ్రౌండ్ వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్ - 19 (Under - 19) ఆసియాక‌ప్ 2025లో భాగంగా యూఏఈ (UAE), ఇండియా మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో యాభై ఓవ‌ర్ల‌కు భార‌త్ ఆరు వికెట్లు కోల్పోయి 433 ప‌రుగులు సాధించింది. ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన వైభ‌వ్ సూర్య‌వంశీ భారీసెంచ‌రీ చేశాడు. 55 బంతుల్లోనే శ‌త‌కం న‌మోదు చేయ‌డంతో పాటు అరోన్ జార్జి, విహాన్ మ‌ల్హోత్రాలు హాఫ్ సెంచ‌రీ సాధించాడు.

వైభ‌వ్ 95 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, 14 సిక్సుల‌తో 171 ప‌రుగులు చేయ‌గా, అరోన్ జార్జి 73 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 69 ప‌రుగులు, విహాన్ మ‌ల్హోత్రా 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 69 ప‌రుగులు చేశారు. మ్యాచ్ ప్రారంభ‌మైన మూడో ఓవ‌ర్లోనే ఓపెనర్‌, కెప్టెన్ ఆయుష్ మాత్రే వికెట్ కోల్పోయిన‌ప్పటికీ, అరోన్ జార్జి, విహాన్ మ‌ల్హోత్రాల‌తో క‌లిసి వైభ‌వ్ ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దాడు. చివ‌ర్లో వికెట్ కీప‌ర్ అభిజ్ఞాన్ ఖండూ 17 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ స‌హాయంతో 32 ప‌రుగులు, క‌నిష్క్ చౌహాన్ 12 బంతుల్లో ఒక ఫోర్‌, మూడు సిక్సుల‌తో 28 ప‌రుగులు సాధించ‌డంతో భార‌త్ భారీ స్కోరు సాధించింది.

 

Advertisement

తాజావార్తలు

Advertisement