త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Farmers protest | మ‌క్క‌లు కొనలేని దొంగ పాల‌నిది.. రేవంత్ ప్ర‌భుత్వంపై రైతుల ఆగ్ర‌హం

Farmers protest | ప్రజాపాలన అని దొంగ పాలన తెచ్చారని కాంగ్రెస్(Congress) ప్ర‌భుత్వంపై రైతులు మండిప‌డుతున్నారు. మ‌క్క‌ల కొనుగోళ్ల‌లో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని క‌న్నెర్ర చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు (Thaduru) పీఏసీఎస్ కేంద్రం వద్ద రాత్రి వేళ నేలపై పడుకుని నిర‌స‌న‌కు దిగారు.

S

News | Published On Apr 27, 2026, 12.02 pm IST

Farmers protest | మ‌క్క‌లు కొనలేని దొంగ పాల‌నిది.. రేవంత్ ప్ర‌భుత్వంపై రైతుల ఆగ్ర‌హం
Advertisement
  • మ‌క్క‌లు కొనే దిక్కు లేక అర్ధ‌రాత్రి నేల‌పై ప‌డుకుని 100 మంది రైతుల నిర‌స‌న‌
  • క్యూలైన్లలో పేప‌ర్లు పెట్టి ప‌డిగాపులు
  • కాంగ్రెస్ స‌ర్కారుపై రైతుల క‌న్నెర్ర‌
  • తాడూరు పీఏసీఎస్ కేంద్రం వ‌ద్ద దుస్థితి

Farmers protest | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రజాపాలన అని దొంగ పాలన తెచ్చారని కాంగ్రెస్(Congress) ప్ర‌భుత్వంపై రైతులు మండిప‌డుతున్నారు. మ‌క్క‌ల కొనుగోళ్ల‌లో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని క‌న్నెర్ర చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు (Thaduru) పీఏసీఎస్ కేంద్రం వద్ద రాత్రి వేళ నేలపై పడుకుని నిర‌స‌న‌కు దిగారు. క్యూలైన్లలో పేపర్లు పెట్టి మక్కజొన్న పంట కొనుగోళ్ల కోసం ప‌డిగాపులు కాస్తున్నారు.

గ‌న్నీ బ్యాగులు అమ్ముకుంటున్నారు..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం మక్కజొన్న పంట కొనుగోళ్లలో విఫలం అయిందని, కనీసం గన్నీ బ్యాగుల సరఫరా కూడా సక్రమంగా చేయడంలేదని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. దళారులు గన్నీ బ్యాగులు దొంగచాటుగా అమ్ముకుంటున్నారు. ప్రజా పాలన అని దొంగ పాలన తెచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నడూ ఇలాంటి దుస్థితి లేదు. అధికారులు కూడా నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారు అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఆందోళ‌న‌ల‌కు వెన‌కాడం..

దాదాపు 100 మంది ఇక్కడే పడుకున్నామని, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గన్నీ బ్యాగులు సరఫరా చేసి, మక్కజొన్న కొనుగోళ్లు చేయాల‌ని డిమాండ్ చేశారు. కొనుగోలు చేయ‌ని ప‌క్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని అన్న‌దాత‌లు హెచ్చరించారు.

మేం చావాల్నా? తొర్రూరులో పోలీసులపై తిరగబడ్డ రైతులు... 

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వ్యవసాయ మార్కెట్ దగ్గర నెల రోజుల నుండి మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడం లేదని నిరసనకు దిగారు. దీంతో రైతులపై కేసులు పెడతామని పోలీసులు బెదిరించారు. నెల రోజుల నుండి ఎండలో పడి చస్తున్నామ‌ని, మముల్ని వీడియో తీసి బెదిరించ‌డం స‌రికాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మేము చచ్చిపోవాలా అంటూ పోలీసులపై తిరగబడ్డారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి.

Advertisement
Advertisement