త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Safety | రోడ్డు భ‌ద్ర‌తా మాసాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాలి: మంత్రి పొన్నం

Road Safety | త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న రోడ్డు భ‌ద్ర‌తా (Road Safety) మాసాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ (Transport) మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అధికారుల‌ను ఆదేశించారు.

A

News | Published On Dec 20, 2025, 2.42 pm IST

Road Safety | రోడ్డు భ‌ద్ర‌తా మాసాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాలి: మంత్రి పొన్నం
Advertisement

Road Safety | త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్న రోడ్డు భ‌ద్ర‌తా (Road Safety) మాసాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ (Transport) మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అధికారుల‌ను ఆదేశించారు. కార్య‌క్ర‌మాల‌లో విద్యార్థుల‌ను భాగ‌స్వాములు చేయాల‌ని సూచించారు. స‌చివాలయంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (CS) రామ‌కృష్ణారావు (Ramakrishna Rao), ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, ర‌వాణాశాఖ క‌మిష‌న‌ర్ ఇలంబ‌ర్తి, అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ మాసంలో చేయాల్సిన కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చించారు. ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల్లో ఉద్యోగులు, వివిధ సంస్థ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేస్తూ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. రోడ్డు ప్ర‌మాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను వారికి వివ‌రించాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్, ఎంజేపి సెక్రటరీ సైదులు, జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీలు, జేటీసీలు, డీటీసీలు, నేషనల్ రోడ్స్ అథారిటీ అధికారులు, ఇతర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement