త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Chief Ramchandar Rao | కాంగ్రెస్ రైతుల‌ను మ‌ర్చిపోయింది.. గాలికొదిలేసింది: భువ‌న‌గిరి ప‌ర్య‌ట‌న‌లో రాంచంద‌ర్‌రావు ధ్వ‌జం

BJP Chief Ramchandar Rao | కాంగ్రెస్ (Congress) ప్ర‌భుత్వం రైతుల‌ను మ‌ర్చిపోయింద‌ని, పూర్తిగా గాలికొదిలేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిప‌డ్డారు. భువనగిరి మండలం హన్మాపూర్‌లో ధాన్యం సేకరణ కేంద్రాలను పరిశీలించి రైతుల ఘోడును అడిగి తెలుసుకున్నారు.

S

News | Published On Apr 30, 2026, 12.17 pm IST

BJP Chief Ramchandar Rao | కాంగ్రెస్ రైతుల‌ను మ‌ర్చిపోయింది.. గాలికొదిలేసింది: భువ‌న‌గిరి ప‌ర్య‌ట‌న‌లో రాంచంద‌ర్‌రావు ధ్వ‌జం
Advertisement

BJP Chief Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కాంగ్రెస్ (Congress) ప్ర‌భుత్వం రైతుల‌ను మ‌ర్చిపోయింద‌ని, పూర్తిగా గాలికొదిలేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిప‌డ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ప‌డుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి(Revanth Reddy) , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు(Thummala Nageshwar Rao) కు చీమ కుట్టినట్టు కూడా లేద‌ని ఫైర‌య్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం ఆయ‌న‌ పర్యటించారు. భువనగిరి మండలం హన్మాపూర్‌లో ధాన్యం సేకరణ కేంద్రాలను పరిశీలించి రైతుల ఘోడును అడిగి తెలుసుకున్నారు.

వంద కుప్ప‌లు ఎప్పుడు ఎత్తుత‌రు?

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. ఇక్క‌డ‌ నెల రోజుల నుంచి కుప్ప‌లు వెట్టుకొని రైతులు ప‌డిగాపులు కాస్తున్న‌రు. టార్పాలిన్లు కేంద్ర ప్ర‌భుత్వమే ఇస్తుంది. కానీ రైతులు క‌వ‌ర్లు కొనుక్కుంటూ, మ‌రికొంద‌రు రెంటుకు తెచ్చుకునే ప‌రిస్థితి ఉంది. వాన‌కు త‌డిసి, ఎండ‌కు ఎండి తీవ్ర ఇబ్బందులు పడుతున్న‌రు. ధాన్యం బ‌రువు త‌గ్గుత‌ది, దాంతో రేటు త‌గ్గుత‌ది. ఇట్ల‌యితే స‌న్న చిన్న‌కారు రైతులు ఏవిధంగా బ‌త‌కాలే, ఏవిధంగా అమ్మాలే? ఇంత‌కుముందే జేసీతో మాట్లాడాను. గ‌త వారం నుంచి రెండే రెండు లారీలు వచ్చాయంట‌. ఇక్క‌డ వంద కుప్ప‌లు ఎప్పుడు ఎత్తుత‌రు? అని ప్ర‌శ్నించారు.

మిల్లర్ల దోపిడీపై కేసులు పెట్టండి...

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్రం ఎందుకు జాప్యం చేస్తుంది? మిల్లర్లు, అధికారులు, దళారులు కుమ్మక్కై.. రైతు కష్టాన్ని దోచుకుంటున్నారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడండి. రైతుల ఉసురు పోసుకోకండి. మిల్లర్ల దోపిడీపై కేసులు పెట్టండి. రైతులను ఇబ్బంది పెట్టకండి. ఆదిలాబాద్‌లో మొక్క జొన్న ప‌రిస్థితి అలాగే ఉంది. త‌క్కువ ధ‌ర‌కు అమ్మాల‌ని రైతుల‌పై ఒత్తిడి తెస్తున్న‌రు. గ‌త ప్ర‌భుత్వం అలా చేసినందుకే వారికి ఆ ప‌రిస్థితి వ‌చ్చింది. మీరు కూడా ఇలా చేస్తే ఎలా? మొల‌క‌లు వ‌చ్చిన ధాన్యం త‌క్ష‌ణ‌మే కొనాలే. రైస్‌మిల్ల‌ర్ల‌ను ఎందుకు పిలిపించ‌రు? వారితో మాట్లాడి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.

రైతులు రాంచంద‌ర్‌రావు ఎదుట త‌మ గోడును వెల్ల‌బోసుకున్నారు. మార్కెట్ కు వ‌చ్చి 20 రోజులుగా ప‌డిగాపులు కాస్తున్నామ‌న్నారు. అకాల వ‌ర్షాల‌కు ధాన్యం త‌డిసి మొల‌క‌లు వ‌స్తున్నాయ‌ని వాపోయారు. ఒక్కో క‌వ‌రును 35 రూపాయ‌లు వెచ్చించి కొంటున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement