త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఆ బాలిక మ‌ళ్లీ గెలిచింది..

KTR | ఆ బాలిక ఆరేళ్ల క్రితం ప్రాణాంత‌క‌మైన‌ బ్రెయిన్ ట్యూమ‌ర్ (Brain tumor) బారిన ప‌డింది. దిక్కు తోచ‌ని స్థితిలో ఉన్న ఆ పేద కుటుంబ ప‌ట్ల కేటీఆర్ పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. స‌కాలంలో వైద్యం అందేలా చేసి ఆ బాలిక జీవితంలో వెలుగులు నింపారు. ఆనాటి మేలు మ‌ర‌వ‌ని ఆ చిన్నారి నేడు కేటీఆర్‌ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంది.

S

News | Published On May 3, 2026, 4.15 pm IST

KTR | ఆ బాలిక మ‌ళ్లీ గెలిచింది..
Advertisement
  • ఆరేండ్ల కింద కేటీఆర్ అండ‌తో బ్రెయిన్ ట్యూమ‌ర్‌ను జ‌యించిన‌ శ‌ర‌ణ్య‌
  • నేడు ప‌ది ప‌రీక్ష‌ల్లోనూ పాస్‌
  • ఆనాటి మేలు మ‌ర‌వ‌ని చిన్నారి
  • నేడు నందిన‌గ‌ర్ నివాసంలో కేటీఆర్‌ను క‌లిసి థ్యాంక్స్ చెప్పిన‌ బాలిక‌
  • వెన్నుత‌ట్టి అభినందించిన కేటీఆర్‌.. భ‌విష్య‌త్‌లో ఉన్న‌తంగా ఎద‌గాల‌ని ఆకాంక్ష‌

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: ఆ బాలిక ఆరేళ్ల క్రితం ప్రాణాంత‌క‌మైన‌ బ్రెయిన్ ట్యూమ‌ర్ (Brain tumor) బారిన ప‌డింది. దిక్కు తోచ‌ని స్థితిలో ఉన్న ఆ పేద కుటుంబ ప‌ట్ల కేటీఆర్ పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. స‌కాలంలో వైద్యం అందేలా చేసి ఆ బాలిక జీవితంలో వెలుగులు నింపారు. నేడు ఆ బాలిక ప‌ది ప‌రీక్ష‌ల్లో మంచి మార్కుల‌తో స‌త్తా చాటి జీవితాన్ని మ‌ళ్లీ గెలిచింది. క‌న్నీళ్ల‌ను జ‌యంగా మార్చుకున్న‌ ఆ చిన్నారి పోరాట క‌థ ప్ర‌తి ఒక్క‌రిలో స్ఫూర్తి నింపింది. ఆనాటి మేలు మ‌ర‌వ‌ని బాలిక నేడు కేటీఆర్‌ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంది.

చిన్న‌మ్మ పూజిత ట్వీట్‌తో..

2019లో ప్యారడైజ్ బలంరాయ్‌కు చెందిన నారాయణ, రాజేశ్వరి దంపతుల కుమార్తె శరణ్య (Sharanya) బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రైవేటు ఉద్యోగులుగా పనిచేసే వీరికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం దాదాపు రూ.20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో ఆ పేద కుటుంబానికి ఏం చేయాలో తోచలేదు. ఆరోగ్యశ్రీలో స‌ద‌రు చిన్నారి పేరు లేకపోవడంతో బసవతారకం ఆసుపత్రిలో అడ్మిషన్ ల‌భించ‌లేదు. దీంతో వారం రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్లిష్ట సమయంలో శరణ్య చిన్నమ్మ పూజిత (Poojitha), ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

స‌ర్జ‌రీ నుంచి డిశ్చార్జ్ వ‌ర‌కు..

దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించి తన బృందాన్ని రంగంలోకి దింపారు. ట్వీట్ చేసిన అరగంటలోనే రిప్లై రావడమే కాకుండా మరుసటి రోజు ఆదివారం (సెలవు దినం) అయినప్పటికీ కేటీఆర్ ఆదేశాలతో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆసుపత్రికి చేరుకుని అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కేటీఆర్ చొరవతో శరణ్యకు అత్యంత ఖరీదైన వైద్యం పూర్తి ఉచితంగా లభించింది. శరణ్యకు స్టంట్ వేయడంతో పాటు మేజర్ సర్జరీ చేశారు. సుమారు రూ.3 లక్షలు ఖరీదైన రేడియేషన్ థెరపీని కూడా కేటీఆర్ స్వయంగా పర్యవేక్షించి ఉచితంగా చేయించారు. స‌ర్జరీ నుంచి డిశ్చార్జ్ వరకు జరిగిన ప్రతి పరీక్ష ఖర్చులను కేటీఆర్ బృందమే భరించింది.

త‌ల్లి భావోద్వేగం..

కాగా శరణ్య ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. తన ప్రాణాలు కాపాడిన కేటీఆర్‌ను నేడు నందిన‌గ‌ర్ నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంది. త‌మ బిడ్డను ఆరోగ్యవంతురాలిని చేయడమే కాకుండా, ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చదువులో రాణించేలా ప్రోత్సహించిన కేటీఆర్‌కు శరణ్య తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా చిన్నారి త‌ల్లి రాజేశ్వ‌రి భావోద్వేగానికి గుర‌య్యారు. తాము ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌లేద‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

అనంత‌రం కేటీఆర్ శర‌ణ్య‌ను వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయ‌న‌ ఆకాంక్షించారు. కష్టాల్లో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడంలో తాను ఎప్పుడూ ముందుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి నిరూపించారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement