ప్రజలారా..పెద్ద మనసు చేసుకోండి.. సీఎం రేవంత్ రెడ్డి
సాగునీటి పరిస్థితి తాగునీటి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కృష్ణా బేసిన్లోనీటి నిల్వలు 72 శాతం తక్కువగా ఉన్నాయి.గోదావరి బేసిన్లో 40 శాతం నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. 23 శాతం లోటు వర్షపాతం ఉంది.అన్ని రిజర్వాయర్లు వట్టిపోయే దశలో ఉన్నాయి.
ఎల్‌నినోను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు అండగా నిలబడాలి
సూపర్ ఎల్ నినోగా పరిగణిస్తున్నారు
అన్ని రిజర్వాయర్లు వట్టిపోయే దశలో ఉన్నాయి
24 వేల గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాల్సి ఉంది
ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి...దుబారా చేయకండి
బండ్లు, కార్లు కడుక్కోవడానికి నీటిని వాడొద్దు.
చుక్క చుక్కను ఆదా చేసుకోవాలి
సీఎం రేవంత్ రెడ్డి
త్రినేత్ర న్యూస్ : ఈసారి వచ్చిన ఎల్ నినో (Elnino) ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని విపత్తు అని..ఈ సమయంలో ప్రజలందరూ సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొన్నట్టే.. ఈ సారి అందరం కలిసి ఎల్ నినోను జయిద్దామని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, నీటి సంక్షోభం, విద్యుత్ సంక్షోభం(Power crisis) దరిమిలా.. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రి వర్గంతో సమావేశమయ్యారు. ఎల్ నినోను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై వారితో ఆయన సంప్రదించారు. ఆ తర్వాత సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు చేసిన విన్నపం ఏమిటంటే...(ఆయన మాటల్లోనే)
ప్రపంచాన్నే వణికిస్తున్నది..
ఇవాళ (అక్టోబర్ 15 గురువారం) సహచర మంత్రివర్గ సభ్యులతో ఎల్‌నినో ప్రభావంపై చర్చించాం. 100 దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ప్రకటించారు.ఒక ప్రకృతి విపత్తు ఎల్‌నినో.తీవ్రమైన ఎండలతో పెద్ద ఎత్తున తాగునీటి కొరత ఏర్పడబోతుందని 2026 సంవత్సరం ప్రారంభంలోనే శాస్త్రవేత్తలు ప్రకటించారు. మనల్నందరినీ వణికించిన కొవిడ్ లాంటిదే ఈ ఎల్ నినో సంక్షోభం. 1950 తర్వాత చాలా సందర్భాల్లో ఎల్‌నినో వచ్చింది. కరువుగా దాన్ని పరిగణించాం.కానీ ఈసారి వచ్చిన కరువు పెద్ద విపత్తు.సూపర్ ఎల్నినోగా పరిగణిస్తున్నారు.
ఏ ధరకు విద్యుత్ దొరికినా కొనుగోలు చేసి అందిస్తున్నాం
ఎల్ నినో వల్ల సాగు, తాగునీటి కొరతతో పాటు విద్యుత్ కొరత కూడా ఏర్పడింది. వానాకాలంలోనే ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశాం.తెలంగాణలో వరి పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు.13 లక్షల ఎకరాల్లో వరి కాకుండా ఇతర పంటలు వేశారు.56 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. అక్టోబర్ నెలలో 15 వేల మెగావాట్లు ఉండాల్సిన విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు పెరిగింది. అదనంగా 5 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలోని 30 లక్షల పంప్సెట్లు ఆన్ అయ్యాయి.మార్చిలో ఉండాల్సిన ఉష్ణోగ్రత అక్టోబర్‌లోనే ఉంది. 20 వేల మూడు మెగావాట్ల విద్యుత్ వినియోగం ఈ రోజు (అక్టోబర్ 15 గురువారం) జరిగింది.ఈ 13 ఏళ్లలో 14 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఈ రెండేళ్లలో ఆరు, ఏడు వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది. విద్యుత్ శాఖ సమర్థవంతంగా పనిచేసి రైతులకు, ఇతర అవసరాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. మరో 20 రోజుల్లో వానాకాలం పంటలు కోతకు వస్తాయి.చేతికొచ్చిన పంట ఎండిపోకూడదన్న లక్ష్యంతో మార్కెట్లో ఏ ధరకు విద్యుత్ దొరికినా కొనుగోలు చేసి రైతులకు అందిస్తున్నాం. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా విద్యుత్ కొరతతో ఉన్నాయి. రైతులు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకే మా ప్రభుత్వం కోతలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. గృహ అవసరాలకు తగినట్లుగా విద్యుత్‌ను అందిస్తున్నాం.
తాగునీటికే క్లిష్టమైన పరిస్థితి...
సాగునీటి పరిస్థితి తాగునీటి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కృష్ణా బేసిన్లోనీటి నిల్వలు 72 శాతం తక్కువగా ఉన్నాయి.గోదావరి బేసిన్లో 40 శాతం నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. 23 శాతం లోటు వర్షపాతం ఉంది.అన్ని రిజర్వాయర్లు వట్టిపోయే దశలో ఉన్నాయి.24 వేల గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాల్సి ఉంది. తాగునీటికే ఈ రోజు క్లిష్టమైన పరిస్థితి ఉంది.చలికాలం ఎండాకాలంలా ఉంది. వచ్చే 8 నుంచి 10 నెలల్లో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం.కేంద్రం నుంచి ఎలాంటి సహకారం తీసుకోవాలనే దానిపై ఈ రోజు సమావేశంలో చర్చించాం.10 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయే పరిస్థితి ఉందని నివేదికలు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పంటను ఎండిపోనివ్వొద్దని అధికారులను ఆదేశించాం. ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటిని చాలా పొదుపుగా వాడాలి. సాగుకు నీటిని పొదుపుగా వినియోగించాలి. 460 టీఎంసీలు ఉండాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు కేవలం 209 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నీటిని పంటలకు ఇస్తే కేవలం నారుమళ్లకే సరిపోతాయి.
దేనినైనా కొనుక్కోవచ్చు.. కానీ నీళ్లను కొనుక్కోలేం.
1947లో కరువు వచ్చినప్పుడు దేశమంతా రైతుల ముందు మోకరిల్లింది. దేశంలో ఎప్పుడు సమస్య వచ్చినా రైతులు ముందు నిలబడ్డారు.రైతాంగం ఎప్పుడూ రాజులాగానే వ్యవహరించింది.పేదలైనా రైతులు రాజులా వ్యవహరించారు. ఎల్‌నినోను ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు అండగా నిలబడాలి.దేనినైనా కొనుక్కోవచ్చు.. కానీ నీళ్లను కొనుక్కోలేం.అందుబాటులో ఉన్న 200 టీఎంసీల నీళ్లను పొదుపుగా వినియోగించుకోవాలి. ఈ నీటిని కేవలం తాగునీటి కోసమే వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.రైతులు పెద్ద మనసు చేసుకుని యాసంగిలో పంటలు వేయడం తగ్గించుకోవాలి.ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి. దుబారా చేయొద్దు. బండ్లు, కార్లు కడుక్కోవడానికి నీటిని వాడొద్దు.చుక్క చుక్కను ఆదా చేసుకోవాలి. తప్పుడు ప్రచారాన్ని నమ్మి వరి వేస్తే నారుమడి దశలోనే ఎండిపోయే ప్రమాదం ఉంది. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు ఖాళీ అయ్యే అవకాశం ఉంది.
ఈసారి వరి వేయకండి
వచ్చే సీజన్లో వరి వేయడాన్ని వాయిదా వేసుకోవాలి.ఉపాధి హామీ ద్వారా పనులు చేపట్టడానికి కార్యాచరణను రూపొందిస్తున్నాం.గత ఏడాది ఈ సమయంలో 25 వేల మంది ఉపాధి హామీ పనులు చేస్తే, ప్రస్తుతం రెండున్నర లక్షల మంది పనుల్లో పాల్గొంటున్నారు.ఉపాధి హామీ పథకంలో చెరువులు, కుంటలను ప్రాధాన్యతగా తీసుకుని మరమ్మతులు చేయాలి. వానాకాలంలో నష్టపోయిన పంటతో పాటు వచ్చే సీజన్లో పంట వేయకుండా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు ఇచ్చే పథకాల ద్వారా రైతులను ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉదారంగా సాయం తీసుకునే అంశంపై అధికారులు నివేదికలు తయారు చేయాలి. ఓవర్‌లోడ్ వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం జరుగుతోంది. ప్రస్తుతం 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది.
దయచేసి సహకరించండి
ఈ విపత్తు సమయంలో నేను చేస్తున్న విన్నపం ఒకటే. అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలి. ప్రతి పౌరుడు ప్రభుత్వానికి సహకరించాలి.ప్రభుత్వ సూచనలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. ప్రకృతి విపత్తును కలిసికట్టుగా నిలబడి ఎదుర్కోవాలి. అందరి సహకారం ప్రభుత్వానికి కావాలి. మీడియా సహకారం ప్రభుత్వానికి వందకు వంద శాతం అవసరం. ప్రభుత్వం నుంచి మీడియా కోసం ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమిస్తాం. టోల్ ఫ్రీ నంబర్ ఇస్తాం.ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు.. అందరితో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాం. విద్యుత్ డిమాండ్ చాలా తీవ్రంగా ఉంది.సాగునీటి విషయంలో పొదుపు పాటించాలి. విద్యుత్‌ను పొదుపుగా వాడాలి. పశువులకు తాగునీరు, పశుగ్రాసం అత్యంత ముఖ్యం. లేకుంటే పిట్టల్లా రాలిపోయే ప్రమాదం ఉంది
ప్రజలను చైతన్యపరచడానికి కళాజాతాలను ఏర్పాటు చేస్తాం. సీనియర్ జర్నలిస్టులు, నిపుణులు పత్రికల్లో వ్యాసాలు రాయాలి.సినీ నటుడు విజయ్ దేవరకొండ ఎల్‌నినోపై ఒక విజ్ఞప్తి చేశారు. మిగిలిన సినీ నటులు, క్రీడాకారులు, కళాకారుల సహకారం తీసుకుని వారితో ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయించి అప్రమత్తం చేస్తాం.
ఇది అందరి సమస్య.. అందరం కలిసి విజయవంతంగా ఎదుర్కోవాలి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jailer 2 OTT | రజనీకాంత్ జైలర్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - నెల రోజుల్లోనే స్ట్రీమింగ్
- ●Poonam Bajwa | స్విమ్మింగ్‌పూల్‌లో టాలీవుడ్ హీరోయిన్ - బికినీ అందాలతో రచ్చ
- ●Rashmika Mandanna | రణబాలి కోసం రష్మిక మందన్న తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?
- ●Theenmar Mallanna | రూ.5,500 కోట్లు ఖర్చు చేసినా వట్టెం ప్రాజెక్టు పూర్తికాలే
- ●Jailer 2 Review | జైలర్ 2 రివ్యూ - రజనీకాంత్ హీరోయిజం, ఎలివేషన్లు ఓకే కానీ ... కానీ కథ ఏది?
- ●Telangana El Nino Crisis | ఏమీ చేయలేం.. ఎల్ నినోపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం

Jailer 2 OTT | రజనీకాంత్ జైలర్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - నెల రోజుల్లోనే స్ట్రీమింగ్

Poonam Bajwa | స్విమ్మింగ్‌పూల్‌లో టాలీవుడ్ హీరోయిన్ - బికినీ అందాలతో రచ్చ

Rashmika Mandanna | రణబాలి కోసం రష్మిక మందన్న తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే?

Theenmar Mallanna | రూ.5,500 కోట్లు ఖర్చు చేసినా వట్టెం ప్రాజెక్టు పూర్తికాలే




