త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TVK Chief Vijay | త‌మిళ‌నాట‌ రిసార్ట్ వ్యూహం.. టీవీకే చీఫ్ పాలి‘ట్రిక్స్’

TVK Chief Vijay | త‌మిళ‌నాట టీవీకే పార్టీ ‘రిసార్ట్ పాలిటిక్స్’ (resort politics) కు తెర లేపింది. త‌మ అభ్య‌ర్థులు చేజార‌కుండా టీవీకే చీఫ్ విజ‌య్ స‌రికొత్త వ్యూహం మొద‌లెట్టాడు. మహాబలిపురం సమీపంలోని పూంజేరి (Punjeri) లో ఉన్న ఓ ప్రైవేట్ రిసార్ట్‌ను హీరో విజయ్ ఇప్ప‌టికే బుక్ చేశాడు. హంగ్ వచ్చే అవకాశం ఉందన్న ఎగ్జిట్ పోల్స్ ఊహాగానాల‌తో.. కౌంటింగ్‌కు ఒకరోజు ముందే రిసార్ట్ బుక్ చేయ‌డం ఆస‌క్తిని రేపుతోంది.

S

News | Published On May 3, 2026, 1.52 pm IST

TVK Chief Vijay | త‌మిళ‌నాట‌ రిసార్ట్ వ్యూహం.. టీవీకే చీఫ్ పాలి‘ట్రిక్స్’
Advertisement
  • పూంజేరిలో రిసార్ట్ బుక్ చేసిన ద‌ళ‌ప‌తి విజ‌య్‌
  • అభ్య‌ర్థులు చేజార‌కుండా జాగ్ర‌త్త‌లు
  • ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌తో త‌మిళ‌నాట ఊహించ‌ని మ‌లుపులు

TVK Chief Vijay | త్రినేత్ర‌.న్యూస్‌: త‌మిళ‌నాట టీవీకే పార్టీ ‘రిసార్ట్ పాలిటిక్స్’ (resort politics) కు తెర లేపింది. త‌మ అభ్య‌ర్థులు చేజార‌కుండా టీవీకే చీఫ్ విజ‌య్ స‌రికొత్త వ్యూహం మొద‌లెట్టాడు. మహాబలిపురం సమీపంలోని పూంజేరి (Punjeri) లో ఉన్న ఓ ప్రైవేట్ రిసార్ట్‌ను హీరో విజయ్ ఇప్ప‌టికే బుక్ చేశాడు. రేపే అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో ముందే అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. తమిళనాడులో హంగ్ వచ్చే అవకాశం ఉందన్న ఎగ్జిట్ పోల్స్ ఊహాగానాల‌తో.. కౌంటింగ్‌కు ఒకరోజు ముందే రిసార్ట్ బుక్ చేయ‌డం ఆస‌క్తిని రేపుతోంది.

100 మందికిపైగా వ‌స‌తి..

ఎగ్జిట్ పోల్స్ అంచనాల‌తో రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మిశ్ర‌మ ఫ‌లితాలు వ‌స్తుండ‌డంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో దళపతి విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ తమ కాబోయే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అప్ర‌మత్తంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. పూంజేరిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో సుమారు 100 మందికి పైగా గెలిచిన అభ్యర్థులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. గెలిచిన‌ అభ్యర్థులంతా క్షణం ఆలస్యం చేయకుండా పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ స్ప‌ష్ట‌మైన‌ ఆదేశాలిచ్చారు. గెలిచిన తర్వాత ఎక్కడికీ వెళ్లొద్ద‌ని ఇటీవ‌ల‌ అభ్యర్థులతో నిర్వ‌హించిన‌ సమావేశంలో ఆయ‌న సూచించిన‌ట్లు తెలిసింది.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

కౌంటింగ్ రోజున ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా భారత ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇవ్వాలని టీవీకే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆధవ్ అర్జునకు విజయ్ సూచించారు. ఫ‌లితాల స‌మ‌యంలో సిద్ధంగా ఉండాలని తమ పార్టీ లీగల్ వింగ్‌ను అప్రమత్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే కూటముల మధ్య గట్టి పోటీ ఉండ‌డంతో ముందుగానే జాగ్రత్త ప‌డుతున్నారు.

కాగా డీఎంకే అధికార ప్రతినిధి సేలం ధరణిధరన్ ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో మాట్లాడుతూ.. రాబోయే దశాబ్దాల్లో డీఎంకేకు ప్రతిపక్షం ఎవరనేదే ఈ ఎన్నికల ప్రధాన అంశమని వ్యాఖ్యానించారు. విజ‌య్‌కి రాజకీయాలు కేవలం ఒక అల‌వాటేన‌ని ఆయన ఎద్దేవా చేశారు. సర్వేల ప్రకారం 40% నుండి 55% మద్దతుతో స్టాలిన్ అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారని తెలిపారు.

Advertisement
Advertisement