త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yashwani Jindal | న‌వీన్ జిందాల్ కూతురి పెళ్లి వేడుక‌ల్లో రాజ‌కీయ నేత‌ల గ్రూప్ డ్యాన్స్‌

Yashwani Jindal | సాధార‌ణంగా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకునే బీజేపీ (BJP) ఎంపీ కంగ‌నా ర‌నౌత్ (Kangana Ranaut), ఎన్‌సీపీ (NCP) ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule), టీఎంసీ (TMC) ఎంపీ మ‌హువా మొయిత్రా (Mahua Moitra)లు ఎంపీ(MP), ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త న‌వీన్ జిందాల్ (Naveen Jindal) కూతురు పెళ్లి వేడుక‌ల్లో రాజ‌కీయాల‌కు అతీతంగా క‌లిసి స్టెప్పులేశారు

A

News | Published On Dec 7, 2025, 1.49 pm IST

Yashwani Jindal | న‌వీన్ జిందాల్ కూతురి పెళ్లి వేడుక‌ల్లో రాజ‌కీయ నేత‌ల గ్రూప్ డ్యాన్స్‌
Advertisement

Yashwani Jindal | ఎంపీ(MP), ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త న‌వీన్ జిందాల్ (Naveen Jindal) కూతురు పెళ్లి వేడుక‌ల్లో రాజ‌కీయాల‌కు అతీతంగా వివిధ పార్టీల‌కు చెందిన ఎంపీలు గ్రూప్ డ్యాన్స్ చేయ‌డం వివాహానికి వ‌చ్చిన వారిని రంజింప‌జేసింది. న‌వీన్ జిందాల్ ఏకైక కూతురు య‌శ్వ‌ని జిందాల్ (Yashwani Jindal) వివాహం ఢిల్లీలో శ‌నివారం వ్యాపార‌వేత్త సందీప్ సొమాని (Sandeep Somani) కుమారుడు శ‌శ్వ‌త్ సొమాని (Shashwat Somani)తో జ‌రిగింది. ఈ వివాహ వేడుక‌ల్లో రాజ‌కీయనాయ‌కులు, ఎంపీలు, అన్ని రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజర‌య్యారు. ఈ వేడుక‌ల్లో బీజేపీ (BJP) ఎంపీ కంగ‌నా ర‌నౌత్ (Kangana Ranaut), ఎన్‌సీపీ (NCP) ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule), టీఎంసీ (TMC) ఎంపీ మ‌హువా మొయిత్రా (Mahua Moitra)లు క‌లిసి హిందీ పాట‌కు క‌లిసి స్టెప్ప‌లేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement