త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SP Balu | తెలంగాణ ద్రోహుల విగ్రహాలు కూల‌గొడుతాం: ఓయూ విద్యార్థి నాయ‌కుల హెచ్చ‌రిక‌

SP Balu | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ద్రోహుల విగ్ర‌హాల‌ను ఎట్టిప‌రిస్థితుల్లోనూ కూల్చివేస్తామ‌ని ఐక్య విద్యార్థి సంఘాల నాయ‌కులు హెచ్చ‌రించారు. ర‌వీంద్ర‌భార‌తి (Ravindra Bharati)లో ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం (SP Balu) విగ్ర‌హ ఏర్పాటును ఖండిస్తూ ఓయూ (Osmania University) ఆర్ట్స్ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడుతూ విగ్ర‌హాల ఏర్పాటును మ‌ళ్లీ తెలంగాణ‌పై ఆధిప‌త్యం చేసేందుకు చేస్తున్న కుట్ర‌గా అభివ‌ర్ణించారు.

A

News | Published On Dec 15, 2025, 4.15 pm IST

SP Balu | తెలంగాణ ద్రోహుల విగ్రహాలు కూల‌గొడుతాం: ఓయూ విద్యార్థి నాయ‌కుల హెచ్చ‌రిక‌
Advertisement

SP Balu | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో నెల‌కొని ఉన్న తెలంగాణ ద్రోహుల విగ్ర‌హాల‌ను కూల‌గొడుతామ‌ని ఉస్మానియా యూనివ‌ర్సిటీ (Osmania University) విద్యార్థి సంఘాల నాయ‌కులు హెచ్చ‌రించారు. తెలంగాణ సాంస్కృతిక కళలు, జానపద కళలకు కేంద్రం అయిన రవీంద్ర భారతి (Ravindra Bharati) లో బాలసుబ్రహ్మణ్యం (SP Balu) విగ్రహం ఏర్పాటును తీవ్రంగా ఖండించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీసీ స్టూడెంట్స్ ఫెడ‌రేష‌న్ (BCSF) రాష్ట్ర అధ్య‌క్షుడు కొమ్మ‌న‌బోయిన సైదులు యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ విలేకరుల సమావేశంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయ‌కులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రప్రాంతీయుల‌ విగ్రహాలు ఎందుకు ప్రతిష్ట చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెల‌పాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతం విముక్తి కోసం ఉద్యమాలకు నాయకత్వం వహించి పోరాటం చేసిన మేధావులు, కవులు, కళాకారుల విగ్రహాలను ట్యాంక్ బండ్ మీద ప్రతిష్టించ‌డంలేదో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేయాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆస్తిత్వం, ఆత్మగౌరవంకోసం జరిగిన పోరాటం లో ఎంతోమంది అమరులు అయినారని గుర్తు చేశారు. వారి చరిత్రను స్మరించుకుంటూ విగ్రహాలు ఏర్పాటు చేయాల‌ని కోరారు.

తెలంగాణ ప్రాంత వనరులను దోచుకున్న ఆంధ్ర ప్రాంత దోపిడిదారుల విగ్రహాలు ఏర్పాటు దేనికి సంకేతమ‌ని విద్యార్థి నాయ‌కులు ప్ర‌శ్నించారు. రవీంద్ర భారతి ఆవరణలో గద్దర్, అందె శ్రీ, గూడ అంజయ్య, సంగం రెడ్డి సత్యనారాయణ, శ్రీకాంతా చారి, బెల్లి లలిత, ప్రభాకర్ రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రవీంద్ర భారతి ఆవరణలో ఎస్పీబీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పకుండా కూల్చేస్తామ‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో మిలియన్ మార్చ్ మాదిరిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మార్చ్ నిర్వహించి తెలంగాణ ద్రోహుల విగ్రహాలు కూల్చడం ఖాయమ‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రమం ఏర్పాటైన త‌రువాత మ‌ళ్లీ ఆధిప‌త్యం కోసం, తెలంగాణ‌ను దోచుకునే ప్ర‌య‌త్నాల్లో భాగంగానే విగ్ర‌హాలు ఏర్పాటు చేస్తున్నార‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. దీనిని తెలంగాణ ప్ర‌భుత్వ స‌హాయంతో చేప‌ట్ట‌డాన్ని తీర‌ని ద్రోహంగా అభివ‌ర్ణించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు పల్లె ఆంజనేయులు, AIOBCSA ఓయూ అధ్యక్షులు మహేష్ గౌడ్, TMYJAC రాష్ట్ర అధ్యక్షులు మీసాల మహేష్, TSP ఓయూ అధ్యక్షులు నూకల మధు యాదవ్, సామాజిక విద్యార్థి నాయకులు చిందం మధు, AISF ఓయూ నాయకులు అశ్వన్, బీసీ యువజన నాయకులు నరేష్ గౌడ్, ఓయూ విద్యార్థి నేత‌లు కంబాలపల్లి మహేష్, నగేష్, శివ, చంద్రకాంత్త దితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement