త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | శెభాష్‌ జాహెర్.. నువొక ప్ర‌జా పోలీస్‌వి.. నిజ‌మైన రోల్ మోడ‌ల్

CP Sajjanar | నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించాడొక ఆటో డ్రైవర్. ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించి మహమ్మద్ జాహెర్ రౌడీ షీటర్ ను నిలువ‌రించాడు. కర్రతో దాడి చేస్తోన్నప్ప‌టికీ బెదరకుండా ప్రతిఘటించాడు.

S

News | Published On May 5, 2026, 4.27 pm IST

CP Sajjanar | శెభాష్‌ జాహెర్.. నువొక ప్ర‌జా పోలీస్‌వి.. నిజ‌మైన రోల్ మోడ‌ల్
Advertisement
  • రౌడీషీట‌ర్‌ను నిలువ‌రించిన ఆటో డ్రైవ‌ర్‌పై సీపీ ప్ర‌శంస‌లు
  • ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించిన మ‌హ్మ‌ద్ జాహెర్‌
  • క‌ర్ర‌తో దాడి చేసినా బెద‌ర‌ని వైనం
  • సీసీటీవీలో వెలుగు చూసిన దృశ్యాలు
  • స‌త్క‌రించి న‌గ‌దు పుర‌స్కారం అంద‌జేసిన సీపీ స‌జ్జ‌నార్‌

CP Sajjanar | త్రినేత్ర‌.న్యూస్‌: నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించాడొక ఆటో డ్రైవర్. ఓ మహిళా బాధితురాలి మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందుకు య‌త్నించ‌గా ప్రాణాలకు తెగించి తన ఆటోనే ఆయుధంగా మలచుకొన్నాడు. ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించి మహమ్మద్ జాహెర్ (Mahammad Zaher) రౌడీ షీటర్ ను నిలువ‌రించాడు. కర్రతో దాడి చేస్తోన్నప్ప‌టికీ బెదరకుండా ప్రతిఘటించాడు. ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (CP Sajjanar) మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలో ప్రత్యేకంగా సన్మానించారు. ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.

వివ‌రాలిలా ఉన్నాయి. మార్చి 4 తెల్లవారుజామున బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లింది. హిందీ మర్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే డబీర్‌పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించాడు. ఆ క్రమంలో కిందపడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ లో గమనించాడు.

ప్ర‌తిఫ‌లం ఆశించ‌కుండా..

ఘటనా స్థలాన్ని దాటి సుమారు 100 మీటర్ల దూరం ముందుకు వెళ్లినప్పటికీ, జాహెర్ వెంటనే స్పందించాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్‌ను తన ఆటోతో ఢీకొట్టి అతడిని కిందపడేశారు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించాడు. గస్తీ తిరుగుతున్న పోలీసులు రౌడీ షీటర్ ను వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు. జాహెర్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుంచి వెళ్లారు. ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషామహల్ పోలీసులకు బాధితురాలు తెలియజేశారు. ఈ వీరోచిత దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో న‌మోద‌య్యాయి. రౌడీ షీటర్ ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన జాహెర్ కోసం గోషామహల్ పోలీసులు ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజీలో ఆటో నంబర్‌ను సేకరించి, సాంకేతిక పరిజ్ఞానంతో జాహెర్‌ను గుర్తించారు.

ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. “చూస్తుండగానే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్థులకు భయం పుడుతుంది అని ప్రశంసించారు.

వెంట‌నే డ‌య‌ల్ 100 కాల్ చేయండి..

నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా, మహమ్మద్ జాహెర్ వ‌లె ధైర్యంతో స్పందించి వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని నగరవాసులకు సీపీ పిలుపునిచ్చారు. కాగా డబిర్ పురకు చెందిన రౌడీ షీటర్ పై గోషా మహల్ పీఎస్ లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయి.

ఈ సన్మాన కార్యక్రమంలో గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్ర మోహన్, గోషామహల్ ఎస్‌హెచ్‌వో శ్రవణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

[video width="320" height="180" mp4="https://www.trinethra.news/static-media/wp-content/uploads/2026/05/WhatsApp-Video-2026-05-05-at-3.55.57-PM-1.mp4"][/video]

Advertisement
Advertisement