Errabelli Dayakar Rao | కేసీఆర్ సభ భయంతోనే రేవంత్ మేడిగడ్డ పర్యటన: మాజీ మంత్రి దయాకర్‌రావు
Errabelli Dayakar Rao | రేవంత్ రెడ్డి (Revanth Reddy) మేడిగడ్డ ప్రాజెక్టు (Medigadda Project) పర్యటన వెనుక ఉన్న ఆంతర్యం ఎంటో ప్రజలకు తెలపాలని, కేసీఆర్ (KCR) జగిత్యాల సభ విజయవంతం కావొద్దనే దురుద్దేశంతో రేవంత్ ఇలాంటి కార్యక్రమాలకు పూనుకుంటున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) విమర్శించారు. గతంలో కూడా కేసీఆర్ నల్గొండ మీటింగ్ పెడితే భయంతో ఆరోజు రేవంత్ మీటింగ్ పెట్టిండన్నారు.
త్రినేత్ర.న్యూస్: రేవంత్ రెడ్డి (Revanth Reddy) మేడిగడ్డ ప్రాజెక్టు (Medigadda Project) పర్యటన వెనుక ఉన్న ఆంతర్యం ఎంటో ప్రజలకు తెలపాలని, కేసీఆర్ (KCR) జగిత్యాల సభ విజయవంతం కావొద్దనే దురుద్దేశంతో రేవంత్ ఇలాంటి కార్యక్రమాలకు పూనుకుంటున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) విమర్శించారు. గతంలో కూడా కేసీఆర్ నల్గొండ మీటింగ్ పెడితే భయంతో ఆరోజు రేవంత్ మీటింగ్ పెట్టిండన్నారు. ఇప్పుడు జగిత్యాల మీటింగ్ అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద రివ్యూ అని చెబుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజీని బీఆర్ఎస్ (BRS) నాయకులతో కలిసి శనివారం ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక ఆరోపణలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాల్లో లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ మీటింగ్ అంటే వెన్నులో వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడిగడ్డ కాదని, అది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపు హౌస్ లు, 203 కిలోమీటర్ల టన్నెల్‌లు, 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రేషర్ మైన్లు, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసే వ్యవస్థ అని వివరించారు.
141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల నీటి ఉపయోగమే కాళేశ్వరం అని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కుట్ర చేసి కేసీఆర్ ను బద్నాం చెయ్యాలనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు కాలయాపన చేశారని మండిపడ్డారు. మేడిగడ్డ నుంచి నీటిని నిల్వ చేయకుండా ఇసుక రవాణా కోసం కిందకు పంపింది కాంగ్రెస్ నాయకుల గురించేనన్న విషయం స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో SRSP శ్రీరాం ప్రాజెక్ట్ కు మహారాష్ట్ర నుంచి చుక్క నీరు రాకుండా మహారాష్ట్రలో అక్రమంగా 10 ప్రాజెక్టులు కడితే తెలంగాణ ఎడారిగా మారింది నిజం కాదా అని ప్రశ్నించారు.

అదే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను అన్నపూర్ణ గా మార్చింది కేసీఆర్ కదా అని నిలదీశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదని రేవంత్ అంటుంటే, మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు మూసి నది వరకు కాళేశ్వరం నీరు వస్తుందని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగతే రెండు రోజులు NDSA వచ్చి హడావుడి చేసిందని.. కుంగిపోయిన పిల్లర్ పనులు తామే స్వయంగా సొంత ఖర్చులతో పూర్తి చేస్తామని ఎల్ & టీ కంపెనీ ముందుకొస్తే పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తాటికొండ రాజయ్య, ప్రభుత్వ మాజీ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, గండ్ర వెంకటరమణ రెడ్డి, ఆరూరి రమేష్, దాసరి మనోహర్, శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ జడ్పి ఛైర్మన్లు గండ్ర జ్యోతి లక్ష్మి, జక్కు శ్రీ హర్షిణి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



