త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fee reimbursement | ఫీజు రీయంబర్స్ మెంట్ కు కొర్రీలు.. పేద విద్యార్థులకు వర్రీలు..

BRS | ఫీజు రీయంబర్స్ మెంట్ (Fee reimbursement) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ‌న్‌పార్క్ (Gun park) వ‌ద్ద సోమ‌వారం నిర‌స‌న (Protest) వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు నినాదాలు చేశారు. ఫీజు రీయంబర్స్ మెంట్ కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రిలు అంటూ ప్లకార్డులు (placards) ప్ర‌ద‌ర్శించారు.

S

News | Published On Mar 23, 2026, 12.27 pm IST

Fee reimbursement | ఫీజు రీయంబర్స్ మెంట్ కు కొర్రీలు.. పేద విద్యార్థులకు వర్రీలు..
Advertisement

- ప్ల‌కార్డులతో గ‌న్‌పార్క్ వ‌ద్ద‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిర‌స‌న

త్రినేత్ర‌.న్యూస్‌: ఫీజు రీయంబర్స్ మెంట్ (Fee reimbursement) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ‌న్‌పార్క్ (Gun park) వ‌ద్ద సోమ‌వారం నిర‌స‌న (Protest) వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు నినాదాలు చేశారు. ఫీజు రీయంబర్స్ మెంట్ కు కొర్రీలు, పేద విద్యార్థులకు వర్రిలు అంటూ ప్లకార్డులు (placards) ప్ర‌ద‌ర్శించారు. అనంతరం శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి (Madhusudana chary) మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల జీవితాలను నిర్ల‌క్ష్యం చేసిన‌ట్టే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ సకాలంలో అందక అనేక మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నార‌ని వాపోయారు.

రూ.12 వేల కోట్ల బ‌కాయిలు..

రూ. 12 వేల కోట్ల రూపాయల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ (SC, ST , BC) విద్యార్థుల పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన అత్యంత ప్రాధాన్యం కలిగిన ఫీజు రీయంబర్స్ మెంట్ కేసీఆర్ కొనసాగించార‌ని గుర్తు చేశారు. విద్యార్థుల బంగారు బాటకు కేసీఆర్ మార్గం చూపిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద విద్యార్థులకు చదవును దూరం చేస్తుందని విమ‌ర్శించారు. ఇప్పటికైనా సకాలంలో బ‌కాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అనంత‌రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ గ‌న్‌పార్క్ వ‌ద్ద నుంచి అసెంబ్లీకి వెళ్లారు. దారి పొడ‌వునా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. బ‌కాయిలు వెంట‌నే విడుద‌ల చేసి పేద విద్యార్థుల‌కు నాణ్య‌తతో కూడిన చ‌దువు అందేలా చూసే బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement