త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట‌కు ప్ర‌భాక‌ర్‌రావు

Phone Tapping | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో తీవ్ర రాజ‌కీయ వివాదాలు రేపిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో మ‌రో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల‌కు అనుగుణంగా శుక్ర‌వారం ఉద‌యం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో తెలంగాణ స్పెష‌ల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) (SIB) మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ (IPS) అధికారి ప్ర‌భాక‌ర్‌రావు (Prabhakar Rao) లొంగిపోయారు. దీంతో సిట్ అధికారులు ఆయ‌న‌ను విచారించ‌నున్నారు.

A

News | Published On Dec 12, 2025, 1.20 pm IST

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట‌కు ప్ర‌భాక‌ర్‌రావు
Advertisement

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో ఆ కేసును విచారిస్తున్న సిట్ (SIT) అధికారుల ఎదుట‌కు తెలంగాణ స్పెష‌ల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) (SIB) మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ (IPS) అధికారి ప్ర‌భాక‌ర్‌రావు (Prabhakar Rao) హాజ‌ర‌య్యారు. సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాల‌తో శుక్ర‌వారం ఉద‌యం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఆయ‌న లొంగిపోయారు. దీంతో సిట్ అధికారులు ఆయ‌న‌ను విచారించ‌నున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ (Telangana)లో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌భాక‌ర్‌రావు విచార‌ణ‌లో ఏవైనా కీల‌క విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయా అని స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టులో గురువారం జ‌రిగిన విచార‌ణ‌లో ప్ర‌భాక‌ర్‌రావును అరెస్టు చేయ‌కుండా గ‌తంలో ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను సుప్రీంకోర్టు స‌వ‌రించింది. ఆయ‌న‌ను పోలీసు కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా ఈ కేసు దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ విచారణ సమయంలో భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని దర్యాప్తు సంస్థకు స్పష్టం చేసింది. అతనికి అవసరమైన మందులు, కోరితే ఇంటి నుంచి ఆహారం అందించాలని సూచిస్తూ తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు సాగిన కస్టోడియల్ విచారణ ఆధారంగా తదుపరి ఏం చేయాలన్నది ఆ రోజు చెబుతామని పేర్కొంది.

ప్ర‌భాక‌ర్‌రావు తరుఫు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ సుదీర్ఘ వాదనలు వినిపిస్తూ ఇది పూర్తి రాజకీయ కక్షతో కూడిన కేసని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాక ముందే... తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభాకర్‌రావును అరెస్ట్ చేయిస్తానని 2021లో చేసిన ప్ర‌సంగాన్ని చ‌దివి వినిపించారు. ప్ర‌భాక‌ర్‌రావు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అనంత‌రం ఇంట్లో ఉన్నా స‌రే, హోంగార్డును పంపి కాల‌ర్ పట్టుకుని ఈడ్చొక‌స్తామ‌ని హెచ్చ‌రించార‌ని వివ‌రించారు. పిటిషనర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన హార్డ్ డిస్క్ ధ్వంసం జరిగినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోందని, కానీ ఆ పని తానొక్కడే చేయలేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే నిబంధనల ప్రకారం దాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి ఇలాంటి సమాచారాన్నంతా ధ్వంసం చేస్తారని చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement