త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EV Vehicles | ఈవీ కారులో వెళ్లి.. స్ఫూర్తి నింపిన పొన్నం, దానం

Ponnam, Daanam | ఈవీ వాహనా (EV Vehicles) లను ప్రోత్సహించడంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), ఎమ్మెల్యే దానం నాగేందర్ (Daanam Nagendar) సోమ‌వారం అసెంబ్లీ(Assembly)కి ఈవీ వాహ‌నంలో వెళ్లారు. మినిస్టర్ క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎలక్ట్రిక్ కారులో ప్రయాణం చేసి ప‌లువురిలో స్ఫూర్తి నింపారు.

S

News | Published On Mar 30, 2026, 12.37 pm IST

EV Vehicles | ఈవీ కారులో వెళ్లి.. స్ఫూర్తి నింపిన పొన్నం, దానం
Advertisement

త్రినేత్ర.న్యూస్‌: ఈవీ వాహనా (EV Vehicles) లను ప్రోత్సహించడంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), ఎమ్మెల్యే దానం నాగేందర్ (Daanam Nagendar) సోమ‌వారం అసెంబ్లీ(Assembly)కి ఈవీ వాహ‌నంలో వెళ్లారు. మినిస్టర్ క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎలక్ట్రిక్ కారులో ప్రయాణం చేసి ప‌లువురిలో స్ఫూర్తి నింపారు. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాలను 10-20 శాతంతో ఇవ్వ‌డానికి ముందుకొచ్చిన టాటా మోటార్స్ ను మంత్రి అభినంద‌న‌లు తెలిపారు.

అనంత‌రం అసెంబ్లీ వ‌ద్ద మంత్రి మాట్లాడుతూ... కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడడానికి ప్రభుత్వం ఈవీ పాలసీని తీసుకొచ్చిందన్నారు. ఈవీ పాలసీలో భాగంగా ప్రభుత్వం 100% రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కోట్లు మినహాయింపు క‌ల్పించిన‌ట్లు వెల్ల‌డించారు. ఈవీ వాహనాల ప్రోత్సాహంలో భాగంగా చార్జింగ్ స్టేషన్ లు, మౌలిక సదుపాయాలు ప్రభుత్వం స‌మ‌కూరుస్తుంద‌ని తెలిపారు.

ఇప్పటికే మహీంద్ర ఎలక్ట్రిక్, గ్రావిటన్ మోటార్స్, ఓలా ఎలక్ట్రిక్స్, ఆతార్ ఎనర్జీ కంపెనీలు ముందుకు వచ్చాయ‌ని చెప్పారు. ఈవీ వాహనాలను ప్రోత్సహించడానికి మరిన్ని కంపెనీలు ముందుకు రావాలని ప్రభుత్వం తరుఫున విజ్ఞప్తి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement