త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Toll Plaza | ఫాస్టాగ్ మాత్ర‌మే.. ఇక‌పై టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు బంద్‌

Toll Plaza | జాతీయ ర‌హ‌దారుల‌పై (National Highways) టోల్ రుసుముల చెల్లింపుల‌కు (Toll Charges) సంబంధించి కొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఇక‌పై టోల్‌ప్లాజాల (Toll Plaza) వ‌ద్ద చెల్లింపులు పూర్తిగా డిజిటల్‌ లావాదేవీలను (Digital Payments) మాత్రమే అనుమతించనున్నారు.

G

News | Published On Apr 1, 2026, 8.47 am IST

Toll Plaza | ఫాస్టాగ్ మాత్ర‌మే.. ఇక‌పై టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు బంద్‌
Advertisement

Toll Plaza | త్రినేత్ర‌.న్యూస్‌: జాతీయ ర‌హ‌దారుల‌పై (National Highways) టోల్ రుసుముల చెల్లింపుల‌కు (Toll Charges) సంబంధించి కొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఇక‌పై టోల్‌ప్లాజాల (Toll Plaza) వ‌ద్ద చెల్లింపులు పూర్తిగా డిజిటల్‌ లావాదేవీలను (Digital Payments) మాత్రమే అనుమతించనున్నారు. బుధ‌వారం (ఏప్రిల్ 1) నుంచి నగదు లావాదేవీలను పూర్తిగా నిలిచిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ఫాస్టాగ్ (FASTag) లేదా యూపీఐ (UPI) ద్వారా మాత్రమే టోల్‌ రుసుములను వసూలు చేస్తున్నారు. న‌గ‌దు లావాదేవీల‌ను నిలిపివేస్తున్న‌ట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) గత నెలలోనే ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఎన్‌హెచ్‌ టోల్‌ప్లాజాల్లో దాదాపు 98 శాతం చెల్లింపులు ఫాస్టాగ్‌ ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగదు లావాదేవీలను నిలిపివేస్తూ ఎన్‌హెచ్ఏఐ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

మ‌రోవైపు ఫాస్టాగ్ కొత్త వార్షిక పాస్ (FASTag Annual Pass) ధ‌ర‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ.3వేల నుంచి రూ.3,075కు పెరిగింది. వాహనదారులు ఒకేసారి పేమెంట్ చేసి ఎలాంటి అంతరాయం లేకుండా టోల్ నుంచి వెళ్లొచ్చు. ఇది ఏడాది పాటు లేదా 200 టోల్ క్రాసింగ్‌ల వరకు ఫస్ట్ ఏది వస్తే అది చెల్లుబాటు అవుతుంది. 200 ప్రయాణాలు పూర్తి అయ్యాక అది ఆటోమేటిక్‌గా సాధారణ ఫాస్టాగ్‌గా మారిపోతుంది.

Advertisement
Advertisement