Women Commission | ఓయూ క్యాంపస్ లేడీస్ హాస్టల్‌ను సందర్శించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద
Women Commission | ఓయూ (OU) క్యాంపస్ లేడీస్ హాస్టల్ (Ladies Hostel) కేర్‌టేకర్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగాప్రవర్తించాడన్నఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ (Women Commission) చైర్మన్ నేరెళ్ల శారద (Nerella Sharada) ఓయూ లేడీస్ హాస్టల్‌ను బుధవారం సందర్శించారు.
Women Commission | ఓయూ (OU) క్యాంపస్ లేడీస్ హాస్టల్ (Ladies Hostel) కేర్‌టేకర్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగాప్రవర్తించాడన్నఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ (Women Commission) చైర్మన్ నేరెళ్ల శారద (Nerella Sharada) ఓయూ లేడీస్ హాస్టల్‌ను బుధవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె గంట పాటు విద్యార్థినులతో సమావేశమయ్యారు. కేర్ టేకర్ వినోద్‌పై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రెండు మూడు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తా కథనాలపై నిజానిజాలు తెలుసుకునేందుకు కోఠిలోని మహిళా యూనివర్సిటీకి వెళ్లినట్లు చెప్పారు. అనంతరం ఓయూ క్యాంపస్‌కు వచ్చినట్లు ఆమె వెల్లడించారు. అమ్మాయిల పట్ల కేర్ టేకర్ అసభ్యకంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై నిజానిజాలను పరి శీలించేందుకు వచ్చామని చెప్పారు.
కోఠి మహిళా వర్సిటీలో విద్యార్థినులతో సమావేశమయ్యాయని, విద్యార్థినులు, అధ్యా పకులను వేరువేరుగా విచారించామన్నారు. ఉమెన్స్ కాలేజీ అమ్మాయిలు ఆరోపించినట్టుగా ఇక్కడ ఏమి జరగలేదని పలువురు విద్యార్థినులు చెప్పారని ఆమె తెలిపారు. అనంతరం తాము వర్సిటీ క్యాంపస్లోని లేడీస్ హాస్టల్లో విద్యార్థినులతో సమావేశమయ్యామని తెలిపారు. లేడీస్ హాస్టల్‌లో చాలా మంది విద్యార్థినులతో మాట్లాడామని, అయితే తామెవరమూ షీ–టీమ్స్‌కు ఫిర్యాదుచేయలేదని చెప్పారని పేర్కొన్నారు. అమ్మాయిలందరూ కూడా అసలు ఇలాంటి ఘటన జరగలేదని చెప్పారని, అయితే ఎవరు ఫిర్యాదు చేశారో తెలియదని చెబుతున్నారని వివరించారు. అయితే ఇదంతా కావాలనే ఒక స్టూడెంట్ గ్రూప్ యూనియన్ కు చెందిన నాయకులు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చినట్లు ఆమె తెలిపారు. షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేసిన అమ్మాయి ఐడి కూడా ఫేక్ అని చెపుతున్నారని, దీనిపై కూడా విచారణ జరుపుతున్నామన్నారు. ఎవరికి అన్యాయం జరిగిందనే విషయాలు స్పష్టంగా తెలియకపోతే ఎలాముందుకు వెళతామని ప్రశ్నించారు. నిజంగా అన్యాయం జరిగిన అమ్మాయికి మహిళా కమిషన్ భరోసా ఇస్తుందని, ఆమెకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన అమ్మాయి వివరాలను సైతం గోప్యంగా ఉంచుతామన్నారు. సదరు బాధిత విద్యార్థి నేరుగా మహిళా కమిషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి, నిజమని తేలితే ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






