Fire Accident | చాదర్‌ఘాట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన గుడిసెలు
Fire Accident | హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూసీ నది సమీపంలో ఉన్న ఓ డెకరేషన్ వస్తువుల గోదాంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire Accident | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూసీ నది సమీపంలో ఉన్న ఓ డెకరేషన్ వస్తువుల గోదాంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంలో ఈవెంట్లు, ఫంక్షన్లకు ఉపయోగించే ప్లాస్టిక్, థర్మాకోల్, బట్టలు వంటివి భారీగా నిల్వ ఉంచడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. కొన్ని గుడిసెలు కాలి బూడిదయ్యాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ఈ ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకు వ్యాపించకుండా అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | అరే బుర్ర తక్కువోడా.. మేడిగడ్డ నింపితే భద్రాచలం రాముడే ఉండడు రా : సీఎం రేవంత్ రెడ్డి
- ●TGSRTC | మీరు బెంగళూరు ప్రయాణికులా.. ఆ బస్సుల్లో మీకు ఫ్రీ జర్నీ
- ●CM Revanth Reddy | కేసీఆర్.. కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ : సీఎం రేవంత్ రెడ్డి
- ●Tollywood | మిరాయ్ బ్యూటీతో మెగా హీరో హారర్ కామెడీ మూవీ - మాస్ పోస్టర్‌తో రిలీజ్ డేట్ చెప్పేశారుగా!
- ●CM Revanth Reddy | భద్రాద్రి రాముడి మీద ఒట్టు.. 117కు సీట్లకు పైగా గెలుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
- ●PM Modi | 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌కు భారత ప్రధాని.. మోదీకి ఘన స్వాగతం

CM Revanth Reddy | అరే బుర్ర తక్కువోడా.. మేడిగడ్డ నింపితే భద్రాచలం రాముడే ఉండడు రా : సీఎం రేవంత్ రెడ్డి

TGSRTC | మీరు బెంగళూరు ప్రయాణికులా.. ఆ బస్సుల్లో మీకు ఫ్రీ జర్నీ

CM Revanth Reddy | కేసీఆర్.. కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ : సీఎం రేవంత్ రెడ్డి

Tollywood | మిరాయ్ బ్యూటీతో మెగా హీరో హారర్ కామెడీ మూవీ - మాస్ పోస్టర్‌తో రిలీజ్ డేట్ చెప్పేశారుగా!



