CM Revanth Reddy | అరే బుర్ర తక్కువోడా.. మేడిగడ్డ నింపితే భద్రాచలం రాముడే ఉండడు రా : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అరే బుర్ర తక్కువోడా.. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోసి మేడిగడ్డ నింపితే భద్రాచలం కొట్టుకుపోతదని సీఎం అన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అరే బుర్ర తక్కువోడా.. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోసి మేడిగడ్డ నింపితే భద్రాచలం కొట్టుకుపోతదని సీఎం అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కుట్రలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఒకరిమీద ఒకడికి నమ్మకం లేదు.. గుంపులు తయారయ్యాయి. మేడిగడ్డలో నీళ్లు నింపాలని కన్నెపల్లికి పోయిండు. అరే బుర్ర తక్కువోడా.. మేడిగడ్డలో గేట్లు దించి నీళ్లు నిలబెడితే.. మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది.. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండడు రా.. 44 గ్రామాలు కొట్టుకుపోతాయి.. దుర్మార్గుడా నీ లుచ్చా రాజకీయాల కోసంమేడిగడ్డ నింపాలి భద్రాచలం కొట్టుకుపోయేలా చేయాలని అడిగితే నోట్లో మాటలేదు. తెల్లారి బావ వచ్చాడు. తాటి చెట్టంతా పెరిగిండు కాడు కానీ తలకాయలో చింతకాయంతా కూడా తెలివి లేదు ఆయనకు. బామ్మర్ది సోంబేరిగాడు.. సాయంత్రం పబ్బులు.. పొద్దున గబ్బు పనులు.. వీళ్లు కాంగ్రెస్‌ను ఓడిస్తాం.. మేం గెలుస్తున్నామని సీఎం సొంత సర్వేలో వచ్చిందని అంటున్నారు.. ఎన్నికలు, రిజర్వేషన్లు, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెల్వకుండా ఎన్నికల సర్వే చేస్తాడా ఎవడైనా..? జూబ్లీహిల్స్‌లో ఇదే మాట్లాడితే బండకేసి కొట్టారు. మా నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించారని సీఎం గుర్తు చేశారు.
వాళ్ల మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి చెప్పమనండి..
మన ఇండ్లలో పెళ్లిళ్లు అయితే బ్యాండ్ మేళాన్ని పిలుపించుకుంటాం.. మనం చెప్పిందే వాయిస్తడు.. అట్లనే సొంత సర్వేలు చేయించుకుని.. ప్రజా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక హరీశ్‌రావును మంత్రిని చేసేందుకు ఏడాది పట్టింది. నాడే మెడ పట్టి బయటకు తోసే ప్రయత్నం చేశారు. ఇవాళ కన్నెపల్లి పోతుంటే కేటీఆర్ హరీశ్‌రావును ఎందుకు తీసుకుపోలేదు. బీజేపీ నేతలతో హరీశ్‌రావు మాట్లాడుతున్నాడు.. చీకట్లో మాట్లాడుతూనే ఉన్నాడు.. కాదని భద్రాచలం రాముడి మీద ఒట్టు వేయమనండి.. వాళ్ల మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి చెప్పమనండి అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
సిగ్గులేనోడా ఇన్ని నిజాలు ఇట్ల ఉంటే తెలంగాణ ప్రజలు నీకు ఓట్లేస్తారా..
కేసులకు భయపడి బీజేపీలో విలీనం చేస్తామని నీ సొంత చెల్లెనే చెబుతుంది. నీ దొంగ సొమ్ము 1400 కోట్లు ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి కొల్లగొట్టారని చెబుతున్నారు. సిగ్గులేనోడా ఇన్ని నిజాలు ఇట్ల ఉంటే తెలంగాణ ప్రజలు నీకు ఓట్లేస్తారా.. కర్రుకాల్చి వాత పెట్టేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు అని సీఎం తెలిపారు.
భట్టి కోరిక మేరకు మధిరకు ఇంజనీరింగ్ కాలేజ్
బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో అమలు చేసిన, ప్రజలకు ఉపయోగపడే ఏ పథకం కూడా రద్దు చేయలేదు. బీఆర్ఎస్ అమలు చేసిన షాది ముబారక్, రైతు బందు పథకాలను మేం కొనసాగించడం లేదా? ప్రతీ పేదవాడికి రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. రైతు భరోసా 12 వేలకు పెంచాం, రైతు రుణమాఫీ చేసి రుణవిముక్తులను చేశాం. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి 26 పార్లమెంట్ స్థానాలకు 20 పార్లమెంట్ స్థానాలు గెలిపిద్దాం. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం. భట్టి కోరికమేరకు మధిరకు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తాం. ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్.. అని పేర్కొంటూ సీఎం రేవంత్ తన ప్రసంగాన్ని ముగించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత





