CP Sumathi | దివ్యాంగుడి కలను నిజం చేసిన సీపీ సుమతి
CP Sumathi | పోలీస్ ఆఫీసర్ కావాలనే ఓ దివ్యాంగుడి చిరకాల స్వప్నాన్ని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి నెరవేర్చారు. కమిషనరేట్ కార్యాలయంలో బాధితుడు రాహుల్‌ను సాధరంగా ఆహ్వానించి, తన కుర్చీలో కూర్చోబెట్టి, పోలీస్ క్యాప్ పెట్టి గౌరవించారు.
CP Sumathi | త్రినేత్ర.న్యూస్ : పోలీస్ ఆఫీసర్ కావాలనే ఓ దివ్యాంగుడి చిరకాల స్వప్నాన్ని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి నెరవేర్చారు. కమిషనరేట్ కార్యాలయంలో బాధితుడు రాహుల్‌ను సాధరంగా ఆహ్వానించి, తన కుర్చీలో కూర్చోబెట్టి, పోలీస్ క్యాప్ పెట్టి గౌరవించారు. చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలనే రాహుల్ ఆశయాన్ని గుర్తించిన సీపీ, అతని నిబద్ధతను అభినందిస్తూ ఈ ప్రత్యేక అవకాశాన్ని కల్పించారు.
ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి వలసొచ్చిన తిరుమలరావు, రాధమ్మ దంపతులు కీసర మండలం దమ్మాయిగూడలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతుల తొలి సంతానం రాహుల్. కాగా అతను పుట్టుకతోనే దివ్యాంగుడు. రెండు కాళ్లు ఉన్నప్పటికీ అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి. మాటలు కూడా సరిగా రావు. అయితే రాహుల్‌కు పోలీసు ఆఫీసర్ కావాలనే కోరిక ఉంది. ఈ విషయం తెలుసుకున్న మల్కాజిగిరి పోలీసు కమిషనర్ సుమతి సోమవారం కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని తన కుర్చీలో కూర్చోబెట్టి ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దివ్యాంగుల పట్ల స్వచ్ఛంద సంస్థలు దయ, కరుణ, ప్రేమ చూపించాలన్నారు.
అత్యంత దీనస్థితిలో ఉన్న రాహుల్‌కు తెలంగాణ దివ్యాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ.. ప్రతిమ ఫౌండేషన్ ఛైర్పర్సన్ రష్మిత కలిసి ఒక వీల్‌చైర్‌ను ఇప్పించి మానవత్వాన్ని చాటుకున్నారు.
తాజావార్తలు
- ●BJP Ramchandar Rao | రాష్ట్రమంతా బీజేపీ శరవేగంగా విస్తరిస్తోంది.. నెక్ట్స్ అధికారం మాదే
- ●boAt | చిన్నారుల కోసం ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్స్ సహిత స్మార్ట్ వాచ్.. లైవ్ ట్రాకింగ్ ఫీచర్‌తో లాంచ్..
- ●Jr Ntr | జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం - డ్రాగన్ షూటింగ్‌కు రెండు నెలలు బ్రేక్
- ●Chardham Yatra | ఉత్తరాఖండ్‌లో వర్షాల బీభత్సం.. చార్ధామ్ యాత్రకు బ్రేక్..
- ●MP Kadiyam Kavya | వరంగల్‌లో పెండింగ్ రహదారులకు ఆమోదం తెలపండి
- ●Rajasthan High Court | విద్యార్థిని టీచర్ మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు : రాజస్థాన్ హైకోర్టు

BJP Ramchandar Rao | రాష్ట్రమంతా బీజేపీ శరవేగంగా విస్తరిస్తోంది.. నెక్ట్స్ అధికారం మాదే

boAt | చిన్నారుల కోసం ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్స్ సహిత స్మార్ట్ వాచ్.. లైవ్ ట్రాకింగ్ ఫీచర్‌తో లాంచ్..

Jr Ntr | జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం - డ్రాగన్ షూటింగ్‌కు రెండు నెలలు బ్రేక్

Chardham Yatra | ఉత్తరాఖండ్‌లో వర్షాల బీభత్సం.. చార్ధామ్ యాత్రకు బ్రేక్..




