Arrive Alive Campaign | ‘గోల్డెన్ అవర్’తో ప్రాణాలను నిలబెట్టొచ్చు: హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్
Arrive Alive Campaign | “అరైవ్ అలైవ్ క్యాంపెయిన్” (Arrive Alive Campaign) ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రచారంలో భాగంగా శుక్రవారం జూబ్లీహిల్స్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ (Jubilee hills Apollo Hospital) లో గోల్డెన్ అవర్ (Golden hour) ప్రాముఖ్యతను తెలియజేశారు. ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై అంబులెన్స్ డ్రైవర్స్, వాలంటీర్స్, కమ్యూనిటీ మెంబెర్స్, ఇతరులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
త్రినేత్ర.న్యూస్: “అరైవ్ అలైవ్ క్యాంపెయిన్” (arrive alive campaign) ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రచారంలో భాగంగా శుక్రవారం జూబ్లీహిల్స్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ (Jubilee hills Apollo Hospital) లో గోల్డెన్ అవర్ (Golden hour) ప్రాముఖ్యతను తెలియజేశారు. ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై అంబులెన్స్ డ్రైవర్స్, వాలంటీర్స్, కమ్యూనిటీ మెంబెర్స్, ఇతరులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ (Joyal davis) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "గోల్డెన్ అవర్" అనేది ప్రమాదం జరిగిన వెంటనే మొదటి 60 నిమిషాలు చాలా కీలకం అని చెప్పారు. ఈ సమయంలో సత్వర వైద్య చికిత్స తీవ్రమైన రక్త స్రావాన్ని, మరణాన్ని నివారించడానికి, దీర్ఘకాలిక వైకల్యాన్ని తగ్గించడానికి అత్యధిక అవకాశం ఉంటుందన్నారు. వేగవంతమైన ప్రతిస్పందనకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. గుండె ఆగిపోవడం వంటి కొన్ని సందర్భాల్లో ఈ సమయ వ్యవధి మరింత తక్కువగా ఉంటుందన్నారు. దీన్ని "స్వర్ణ 10 నిమిషాలు" (Golden 10 minutes) అని పిలుస్తారని వివరించారు. సీపీఆర్ (CPR) ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చన్నారు.

గోల్డెన్ అవర్ లో బాధితులకు అందించాల్సిన ప్రథమ చికిత్స గురించి ఆటో, క్యాబ్, బస్సు డ్రైవర్లకు, యువతకు శిక్షణ ఇచ్చి బాధితుల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. తీవ్రమైన ప్రమాదం జరిగిన తర్వాత "గోల్డెన్ అవర్"లో రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసిన వ్యక్తులకు భారత ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వం 'రాహ్-వీర్' (మంచి సమారిటన్) పథకంలో రూ.25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు రహదారి భద్రతకు సంబంధించిన ముఖ్యమైన నిబంధనలను తెలియజేశారు. రోడ్ పై మన భద్రతతో పాటు ఇతరుల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకతపై ఆయన అవగాహన కల్పించారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్-2) కాజల్ సింగ్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేసేటప్పుడు అపప్రమత్తతో ఉండాలన్నారు. నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది ఒక చురుకైన, సురక్షితమైన డ్రైవింగ్ వ్యూహమని.. ఇది ప్రమాదాలను ముందుగానే ఊహించడం, అప్రమత్తంగా ఉండటం, వాహనం చుట్టూ ఉన్న స్థలాన్ని గమనించడం ద్వారా ప్రమాదాలను నిరోదించొచ్చన్నారు. ఇందులో ప్రశాంతంగా ఉండటం, వేగాన్ని నిర్వహించడం, ప్రతికూల పరిస్థితులకు లేదా ఇతరుల తప్పులకు సర్దుబాటు చేయడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించడం ఉంటుంది అని వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్-2) సి.వేణుగోపాల్ రెడ్డి, జూబ్లీహిల్స్ జోన్ ట్రాఫిక్ ఏసిపి కె.హరి ప్రసాద్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఇన్‌స్పెక్టర్ మహేష్ స్వామి, శేఖర్, బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్‌స్పెక్టర్ నాగుల అశోక్, ఇతర పోలీస్ సిబ్బంది తో పాటు అపోలో ఆసుపత్రి ప్రొఫెసర్ డా. విశ్వేశ్వర్ రెడ్డి, సీనియర్ కాన్సులేట్ డా. సౌజన్య, టి.టి.ఐ. సిబ్బంది పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





