త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రేవంత్‌…ఇదే సంస్కారం మాట‌ల్లో ఉంటే బాగుంటుంది

శాస‌న‌స‌భ‌లో స‌మావేశాల తొలిరోజైన సోమ‌వారం నాడు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి వ‌చ్చి క‌ర‌చాల‌నం చేసి ప‌ల‌క‌రించ‌డాన్ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ స్వాగ‌తించారు.

a

News | Published On Dec 29, 2025, 12.56 pm IST

KTR | రేవంత్‌…ఇదే సంస్కారం మాట‌ల్లో ఉంటే బాగుంటుంది

సంక్షిప్త సారాంశం

పోలవరం 70 ఏండ్ల నుంచి వింటున్నాం. కానీ పూర్తి కాలేదు. కానీ కాళేశ్వ‌రం కేసీఆర్ గారి హ‌యాంలోనే పూర్తి అయింది. కాలంతో పోటీ ప‌డి మ‌రీ ఆయ‌న కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టారు. అంత త్వ‌ర‌గా పూర్తి కావ‌డ‌మంటే అది ఆయ‌న నిబ‌ద్ధ‌త‌. కాళేశ్వరంలొ రంధ్రాన్వేష‌ణ చేస్తూ సాగ‌దీస్తూ ఉంటే రాష్ట్రానికే న‌ష్టం జ‌రుగుతుంది

Advertisement

రేవంత్‌...ఇదే సంస్కారం మాట‌ల్లో ఉంటే బాగుంటుంది

ట్యాపింగ్ కేసు ఓ అటెన్ష‌న్ డైవ‌ర్ష‌న్‌
కాంగ్రెస్ అప్పుల ప్రచారం కూడా ప్రజలు నమ్మడం లేదు
కాలంతో పోటీ పడి మరీ కాళేశ్వ‌రం క‌ట్టాం
నీళ్లిచ్చింది ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలుసు
పాలమూరు ప్రాజెక్టును రేవంత్ కావాలనే పండపెట్టిండు
జీహెచ్ ఎంసీని అడ్డ‌గోలుగా విభ‌జిస్తున్నారు
గడ్డం పెంచిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ కాలేడు
శాస‌న‌స‌భ ప్రాంగ‌ణంలో చిట్‌చాట్ లో కేటీఆర్ వ్యాఖ్య‌లు

trinethra.news: శాస‌న‌స‌భ‌లో స‌మావేశాల తొలిరోజైన సోమ‌వారం నాడు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి వ‌చ్చి క‌ర‌చాల‌నం చేసి ప‌ల‌క‌రించ‌డాన్ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ స్వాగ‌తించారు. ఇలా ప‌ల‌క‌రించుకునే సానుకూల వాతావార‌ణాన్ని ఆయ‌న ఆహ్వానించారు. ఇదే సంస్కారాన్ని సీఎం రేవంత్ త‌న మాట‌ల్లో చూపితే ఇంకా బాగుంటుంద‌ని సూచించారు. అసెంబ్లీ ప్రాంగ‌ణంలో విలేక‌రుల‌తో కేటీఆర్ కాసేపు ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అనేక అంశాల‌పై ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. మ‌రికొన్ని విష‌యాల‌పై ప్ర‌భుత్వ వైఖ‌రిని త‌ప్పు బ‌ట్టారు. ఆయ‌న ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే....

టెలిఫోన్ ట్యాపింగ్

టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక్క కేసీఆర్ ప్ర‌భుత్వ‌మే చేయ‌లేదు. అది అన్ని ప్ర‌భుత్వాలు చేస్తాయి. అన్ని రాష్ట్రాలు కూడా చేస్తాయి. ఈ గూఢ‌చారి వ్య‌వ‌స్థ నెహ్రూ కాలం నుంచి నేటి దాకా ఉంది. ప్ర‌తిరోజూ ముఖ్య‌మంత్రికి ఇంటెలిజెన్సు విభాగం నివేదిక‌లు ఇస్తూ ఉంటుంది. అంతెందుకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌తిప‌క్ష నేత‌ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌వే కాదు సొంత మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు. సిట్ విచార‌ణ‌ల‌ వంటి డ్రామాలతో ఎన్ని రోజులు ప్రజల దృష్ఠిని తప్పిస్తారు. ఈ అటెన్షన్ డైవర్షన్ తో ఎన్ని రోజులు కాలం వెళ్ల‌దీస్తారు? ఇన్ని సిట్ లు, విచారణలు, కేసుల పేరుతో సాధించింది ఏమిటి? కనీసం ఒక్క దాంట్లో అయినా నిజం ఉందని తెలిందా? ప్రజలు ఈ డైవర్షన్లను గ్రహిస్తున్నారు. అందుకే మాకు సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు మాకు ఒటు వేశారు. కాంగ్రెస్ కు పరిపాలన రాదాని తెలిపోయింది. కాంగ్రెస్ అప్పుల ప్రచారం కూడా ప్రజలు నమ్మడం లేదు.

కాళేశ్వ‌రంలో రంధ్రాన్వేష‌ణ‌తో రాష్ట్రానికే న‌ష్టం

పోలవరం 70 ఏండ్ల నుంచి వింటున్నాం. కానీ పూర్తి కాలేదు. కానీ కాళేశ్వ‌రం కేసీఆర్ గారి హ‌యాంలోనే పూర్తి అయింది. కాలంతో పోటీ ప‌డి మ‌రీ ఆయ‌న కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టారు. అంత త్వ‌ర‌గా పూర్తి కావ‌డ‌మంటే అది ఆయ‌న నిబ‌ద్ధ‌త‌. కాళేశ్వరంలొ రంధ్రాన్వేష‌ణ చేస్తూ సాగ‌దీస్తూ ఉంటే రాష్ట్రానికే న‌ష్టం జ‌రుగుతుంది త‌ప్ప రాజ‌కీయంగా బీఆర్ ఎస్ పార్టీకి ఎలాంటి న‌ష్టం ఉండ‌దు. ప్రజలకు తెలులసు నీళ్లు ఇచ్చింది బీఆర్ ఎసే అని తెలుసు. కృష్ణ జ‌లాల్లో తెలంగాణ వాటా కేవ‌లం 299 టీఎంసీలేన‌ని ఒప్పుకున్న‌ది 2014కు ముందు ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వమే. పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మేం 90 టీఎంసీలు కేటాయిస్తే..కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్రం 45 టీఎంసీల‌కే ఒప్పుకున్న‌ది. పాలమూరు ప్రాజెక్టును రేవంత్ కావాలనే పండపెట్టిండు. ప్రాజెక్టు పూర్త‌యితే కెసీఅర్ కు పేరు వస్తుంది. కృష్ట నదినుంచి నీళ్లు తీసుకుంటే బాబుకు కోపం వస్తుంది. అందుకే సీఎం రేవంత్ ...పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టును పండబెట్టి.. కాలువలు కూడా తవ్వ‌డం లేదు.

మా నాన్న‌ను అంటే ఊరుకునేది లేదు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత త‌న సోద‌రుల‌తో క‌లిసి చేస్తున్న అక్ర‌మాల‌ను మేము ఆపుతున్నామ‌నే మాపై సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వ‌చ్చిన‌ట్టు బూతులు మాట్లాడుతున్నాడు. న‌న్ను ఎన్ని తిట్టినా స‌హిస్తా. కానీ మా నాన్న‌ను అంటే మాత్రం ఊరుకునేది లేదు. రేవంత్ బూతుల‌కు నేను రెస్పాండ్ అవుతూ ఉంటే.. రేవంత్ స్థాయికి దిగ‌జారొద్ద‌ని శ్రేయోభిలాషులు నాకు హిత‌వు ప‌లుకుతున్నారు. . 24 నెలల్లో చేసిన రెండున్నర లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది?

జీహెచ్ఎంసీ అడ్డ‌గోలు విభ‌జ‌న

జీహెచ్ఎంసీ ను మూడు భాగాలుగా చేస్తారంట‌. ఫోర్త్ సిటీ అని పెట్టాడు కదా దాన్ని కూడా ఏదో కార్పొరేషన్ చేస్తారేమో. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకుంటారా? అన్నింటికి సమాధానం చెప్పి తీరాలి. స‌భ‌లో దీనిపై చర్చ పెట్టాలి. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్, ఏంఐఎం ఎవరికి లాభం చేకూర్చేలా చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ అశాస్త్రీయ విభ‌జ‌నతో న‌గ‌ర అభివృద్ధికి విఘాతం ఏర్ప‌డుతుంది.అడ్డగోలుగా విభజన చేశారు

చెక్ డ్యాం పేల్చేసింది రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌నే

ఇటీవ‌ల జ‌రిగిన చెక్ డ్యాం పేల్చివేత వెన‌క ఉన్న‌ది రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఆనాడు మేడిగడ్డ పేల్చారు అని పిర్యాదు చేశారు ఇంజనీర్లు. అయినా ప్ర‌భుత్వం విచారణ చేపట్టడం లేదు. రష్యా ఉద్యమం లో కాకువ డ్యాం ను పేల్చిన‌ట్టే ఇక్క‌డ కూడా మేడిగడ్డ‌ను పేల్చేశార‌ని ఆర్ ఎస్ ప్రవీణ్ క్లుప్తంగా వివరించి చెప్పారు. కాబ‌ట్టి చెక్ డ్యాంల పేల్చివేత‌పై విచార‌ణ జ‌ర‌గాల్సిందే. ఇక పోతే... ఈ మ‌ధ్య గ‌డ్డాలు, మీసాల గురించి రేవంత్ మాట్లాడుతున్నారు.
గడ్డం పెంచిన ప్రతి ఒక్కరూ గబ్బర్ సింగ్ కాలేరు. గడ్డాలు పెంచడం చాల ఈజీ… పాలన చేయడమ కష్టం. నాకు గ‌డ్డం, మీసాలు లేవ‌ని రేవంత్ అంటున్నారు. మ‌రి రాజీవ్ గాంధీకి, రాహుల్ గాంధీకి కూడా లేవు క‌దా.

Advertisement

తాజావార్తలు

Advertisement