త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Kumar Goud | క‌వితకు టీపీసీసీ చీఫ్ కంగ్రాచులేష‌న్స్

Mahesh Kumar Goud | కొత్త పార్టీ పెట్టిన క‌విత‌(Kavitha)కు టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ అభినంద‌న‌లు (Congratulations) తెలిపారు. కేటీఆర్(KTR) కు రాజకీయం తెలియదన్న‌ కవిత వ్యాఖ్యల్లో నిజం ఉండొచ్చ‌న్నారు.

S

News | Published On Apr 25, 2026, 6.30 pm IST

Mahesh Kumar Goud | క‌వితకు టీపీసీసీ చీఫ్ కంగ్రాచులేష‌న్స్
Advertisement

Mahesh Kumar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: కొత్త పార్టీ పెట్టిన క‌విత‌(Kavitha)కు టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ అభినంద‌న‌లు (Congratulations) తెలిపారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలకు ఎల్ల‌ప్పుడూ స్వాగతం ఉంటుంద‌న్నారు. కేటీఆర్(KTR) కు రాజకీయం తెలియదన్న‌ కవిత వ్యాఖ్యల్లో నిజం ఉండొచ్చ‌న్నారు. ఇదే స‌మ‌యంలో ఆమెపై విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌విత పార్టీ వ‌చ్చినా, ఇంకా రేపు ఎన్ని పార్టీలు వ‌చ్చినా కాంగ్రెస్‌కు తిరుగుండ‌ద‌ని, మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని వ్యాఖ్య‌నించారు. గాంధీ భ‌వ‌న్‌లో శ‌నివారం ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

ఎన్ని పార్టీలు వ‌చ్చినా కాంగ్రెస్ కు తిరుగులేదు..

బీఆర్ఎస్ ప‌దేళ్ల పాల‌న‌లో కేసీఆర్ చుట్టూ గుంట న‌క్క‌లు ఉన్నాయా? పంది కొక్కులు ఉన్నాయో క‌విత‌కు తెలియ‌దా? కవిత పార్టీ వచ్చినా.. రేపు ఎన్ని పార్టీలు వచ్చినా కాంగ్రెస్ కి తిరుగులేదు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్ చుట్టూ గుంట నక్కలు ఉన్నాయా? పంది కొక్కులు ఉన్నాయా? పదేళ్లలో కవిత కి తెలియదా? కేటీఆర్ గురించి కవితకే ఎక్కువ తెలుసు. కేటీఆర్ రాజకీయం తెలియదని కవిత వ్యాఖ్యల్లో నిజం ఉండొచ్చు. రాజకీయాల్లో ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు అని మ‌హేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.

సీఎంపై క‌విత వ్యాఖ్య‌లు అర్థ‌ర‌హితం..

ప్రజా స్వామ్యంలో కొత్త పార్టీలకు స్వాగతం. కవిత పార్టీ పెట్టినందుకు అభినందనలు. అజారుద్దీన్, కోదండ రామ్ కి హృదయ పూర్వక అభినందనలు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాట మరిచిపోవద్దు. 2014 నుంచి 2023 బీఆర్ ఎస్ దోపిడీలో కవితకు భాగస్వామ్యం ఉంది. దోపిడీపై కవిత వివరణ ఇస్త‌లేదు. సీఎం రేవంత్ పై కవిత వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయి. మహిళ కేంద్రంగా ప్రజా పాలన సాగుతోంది. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన అందిస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి పట్టణీకరణ వరకు ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని టీపీసీసీ చీఫ్ చెప్పారు.

 

Advertisement
Advertisement